హీరోకంటే విలన్ కి ఎక్కువ రెమ్యునరేషన్.. ఏకంగా రూ.200 కోట్లు తీసుకుంటున్నాడట..

హీరోకంటే విలన్ కి ఎక్కువ రెమ్యునరేషన్.. ఏకంగా రూ.200 కోట్లు తీసుకుంటున్నాడట..

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి మహా ఇతిహాసం రామాయణం ఆధారంగా "రామాయణ్" అనే సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శ్రీరామ చంద్రుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తుండగా సీత పాత్రలో మలయాళ బ్యూటిఫుల్ హీరోయిన్ సాయిపల్లవి నటిస్తోంది. ఇక రావణుడి పాత్రలో కన్నడ హీరో యష్ నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం ముంబై లో సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకోసం దాదాపుగా రూ.800 కోట్లు పైగా బడ్జెట్ వెచ్చిస్తున్నట్లు సమాచారం. 

అయితే ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న హీరో యష్ కి కేజీఎఫ్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ పెరిగింది. దీంతో యష్ ఇకనుంచి తన రాబోయే సినిమాలు పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే "రామాయణ్" సినిమా కోసం యష్ ఏకంగా రూ.200 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో అభిమానులు షాక్ అవుతున్నారు.

Also Read :- ఓటీటీలోకి లేటెస్ట్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ..

ఇక ఈ సినిమాలో రాముడిగా నటిస్తున్న రణబీర్ కపూర్ కూడా దాదాపుగా రూ.100 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. అయితే రణబీర్ కి సౌత్ లో పెద్దగా క్రేజ్ లేదు. దీంతో నార్త్ తోపాటూ సౌత్ లో మంచి క్రేజ్, మార్కెట్ ఉండటంతో యష్ కి ఎక్కువైవ రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా రామాయణ్ స్టోరీ లెంగ్త్ ఎక్కువగా ఉండటంతో ఎండు భాగాలుగా రిలీజ్ చేసందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే రామాయణ్ మొదటిభాగం 2026 లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.