రిలీజ్ కి ముందే కాంతార, కేజీయఫ్, లియో సినిమాల రికార్డులపై కన్నేసిన పుష్ప..

రిలీజ్ కి ముందే కాంతార, కేజీయఫ్, లియో సినిమాల రికార్డులపై కన్నేసిన పుష్ప..

ప్రముఖ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికహవడు దీనికితోడు గత కొన్ని రోజులుగా పుష్ప 2 సినిమా టీమ్ పోస్టర్లు, అప్డేట్లు అంటూ ప్రమోషన్స్ చేస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గురువారం రోజున పుష్ప 2 : ది రూల్ చిత్ర టీం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తదితరులు పాల్గొన్నారు. 

ఇందులోభాగంగా పుష్ప 2 సినిమా ఓవర్సీస్ లో దాదాపుగా 3 వేలకి పైగా లొకేషన్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఎటువంటి అంతరాయం లేకుండా అన్ని సెంటర్లలో అనుకున్న సమయానికి షోలు ప్రసారం చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇక ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన నవీన్ యెర్నేని స్పందిస్తూ నాన్ థియేట్రికల్ బిజినెస్ గురించి మాట్లాడుతూ రూ.420 కోట్లు కలెక్ట్ చేసిందని కన్ఫర్మ్ చేశారు.

ALSO READ | బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన పుష్ప 2 టీం.. ఒకరోజు ముందుగానే..

ఇక కన్నడ డిస్ట్రిబ్యూటర్ రవి మాట్లాడుతూ ఇప్పటివరకూ కన్నడలో కాంతార, కె.జీ.యఫ్ 2 చిత్రాలు ఇప్పటివరకూ ఎక్కువ వసూళ్లు సాధించాయని అన్నారు.  పుష్ప 2 చిత్రంతో ఈ రెండు చిత్రాల రికార్డులని బద్దలు కొడతామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే పుష్ప 2 సినిమాని దాదాపుగా 500 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నామని మొదటి రోజు రూ.30 కోట్లు రాబట్టి రికార్డులు క్రియేట్ చేస్తామని తెలిపారు.

ఇక కేరళ ముఖేష్ మెహతా మాట్లాడుతూ కేరళలో ఇప్పటివరకూ లియో ఫస్ట్ డే హైయేస్ట్ కలెక్షన్లు రూ.12 కోట్లు ఉందని దీంతో పుష్ప 2 చిత్రంతో ఈ రికార్డులను కూడా బ్రేక్ చేస్తామని తెలిపాడు.

అయితే రిలీజ్ కి ముందే దాదాపుగా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిన పుష్ప 2 : ది రూల్ చిత్రం 6 భాషలలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం, బెంగాలీ తదితర భాషలలో డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.