కన్నడ ప్రముఖ హీరో రియల్ స్టార్ ఉపేంద్ర రావు హీరోగా నటించి దర్శకత్వం వహించిన యూఐ సినిమా భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అయిన యూఐ సినిమా విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..
కథ: సత్య(ఉపేంద్ర) మూవీ డైరెక్టర్ గా పని చేస్తుంటాడు. అయితే సత్యకి సమాజంలో జరుగుతున్న సంఘటనలకారణంగా అంతర్గత సంఘర్షణతో బాధ పడుతుంటాడు. ఈ క్రమంలో తానే యూఐ సినిమా తీసి రిలీజ్ చేస్తాడు. ఈ సినిమా మీరు ఇంటెలిజెంట్స్ అయితే ఇప్పుడే సినిమా చూడకుండా బయటికెళ్ళవచ్చు, మీరు ఫూల్స్ అయితే ఫుల్ సినిమా చూడండి అంటూ టైటిల్ కార్డ్స్ తో ప్రారంభం అవుతుంది. అయితే సినీ విశ్లేషకుడు కిరణ్ ఆదర్శ్(మురళీ శర్మ) యూఐ సినిమా చూడటానికి వెళ్లి అర్థం కాక రివ్యూ రాయడానికి ఇబ్బంది పడుతుంటాడు. దీంతో ఈ యూఐ సినిమా దర్శకుడు సత్య ని కలిసి మాట్లాడేందుకు వెళ్తాడు. ఈ క్రమంలో యూఐ సినిమా గురించి షాకింగ్ నిజాలు తెలుసుకుంటాడు. అసలు ఈ సినిమాలో కల్కి భగవాన్ ఎవరు..? సత్య స్టోరీ ఏంటనేది తెలియాలంటే యూఐ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: విచిత్రమైన టైటిల్ కార్డ్స్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. దీంతో ఆడియన్స్ కి స్టార్టింగ్ లోనే ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా మైయిన్ ప్లాట్ నేటి సమాజంలో జరిగే సంఘటనలు, ప్రాథమిక హక్కులు వంటివాటి బ్యాక్ డ్రాప్ లో ఉండటంతో ఆడియన్స్ కి ఈజీగా కనెక్ట్ అయ్యింది. ఇక సత్య పాత్రలో నటించిన ఉపేంద్ర తన గెటప్స్, డైలాగ్స్ తో ఆడియన్స్ ని బాగానే అలరించాడు. ముఖ్యంగా కొన్ని సంఘటనలని ఎలివేట్ చేస్తున్న సమయంలో ఉపేంద్ర యాక్టింగ్ అద్భుతంగా ఉంది. దీంతో వింటేజ్ ఉపేంద్ర ని చూడచ్చు.
ఇక ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా ఉంది. యూఐ ఫాంటసీ ప్రపంచంలో అద్భుతమైన విజువల్స్‌తో కూడిన రైడ్‌లో మిమ్మల్ని తీసుకెళ్తుంది. సెకండాఫ్‌లో కీలకాంశాలతో ఉపేంద్ర సినిమాను వివరించిన విధానం బాగుంది. కీలక పాత్రలో నటించిన రవిశంకర్ తన పాత్రకి చక్కగా న్యాయం చేశాడు. మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే ఉత్కంఠభరితమైన క్లైమాక్స్ అలాగే క్లైమాక్స్ సమయంలో వచ్చే పాట హైలెట్ గా నిలిచాయి.
Also Read :- హీరో కాకుంటే.. హీరోయిన్ కంటే తక్కువగా చూస్తారు
బేసిక్ ఫిలాసఫీ బాగున్నప్పటికీ, కథలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇందులో ముఖ్యంగా కొన్ని సీన్స్, బీజీయం, వంటివి అనవసరంగా డిస్టబెన్స్ క్రియేట్ చేశాయని చెప్పవచ్చు. దీంతో సామాన్యుడికి అర్థమయ్యేలా చాలా క్లిష్టమైన సన్నివేశాలు ఉన్నాయి. సినిమాలో డార్క్ కామెడీ ఉంది కానీ అది అందరికీ కనెక్ట్ అవ్వదు. ఫస్ట్ హాఫ్ కొంతమేర ల్యాగ్ ఉన్నప్పటికీ సెంకెడాఫ్ మాత్రం ఫర్వాలేదని చెప్పవచ్చు.
సాంకేతిక నిపుణల పనితీరు: సినిమాలో VFX చాలా బాగుంది. దీంతో విజువల్స్, గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా ఆడియన్స్ ని యూఐ ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చారు. తన ఎక్స్ పీరియన్స్ ని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. దీంతో ఎలివేషన్స్ , సాంగ్స్ లో ఇచ్చిన బీజీయం ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయ్యింది. ఇక సెట్ వర్క్ మరియు గ్రాఫిక్స్ బాగుంది కాబట్టి ప్రొడక్షన్ డిజైన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి.
ఇక ఎడిటింగ్ విషయానికొస్తే కొన్ని ఫస్టాఫ్ లో కొన్ని చోట్ల ల్యాగ్ సీన్స్ కి కత్తెర పెట్టాల్సింది. దీంతో ల్యాగ్ తో పాటు రన్ టైం కూడా తగ్గి బోర్ కొట్టకుండా మరింత ఆసక్తి పెరిగేది. కన్నడతోపాటూ తెలుగులో ఉపేంద్రకి మంచి క్రేజ్ ఉండటంతో తెలుగు డబ్బింగ్ పై శ్రద్ద వహించారు. దీంతో డైలాగులు, డబ్బింగ్ బాగుందని చెప్పవచ్చు.
దర్శకుడు ఉపేంద్ర విషయానికి వస్తే హీరోగా, దర్శకుడిగా సినిమాకి కెప్టెన్ ఆఫ్ ది షిప్ గా పని చేసాడని చెప్పవచ్చు. రియల్ లైఫ్ ని తెరమీద చూపించడంలో ఉపేంద్ర మంచి దిట్ట. గతంలో ఉపేంద్ర తీసిన ఏ, ఉపేంద్ర సినిమా ఛాయలు యూఐలో కూడా కనిపిస్తాయి. యూఐ లో రాజకీయ నాయకులు మనల్ని ఎలా మోసం చేస్తున్నారో, దాని నుంచి మనం ఎలా బయటపడాలో చెప్పే ప్రయత్నం చేశాడు. అంతబాగానే ఉంది కానీ క్లైమాక్స్ విషయంలో మరింత శ్రద్ద వహించి ఉంటే బాగుండేది.
తీర్పు: ఎప్పుడూ రొటీన్ సినిమాలు చేసేవారికి కాకుండా డిఫరెంట్ గా ట్రై చేసేవారికి యూఐ కచ్చితంగా నచ్చుతుంది. అలా కాకుండా లవ్, ఎమోషన్ సీన్స్ ఉండాలి, యాక్షన్ సీన్స్ ఉండాలనుకునేవారు మాత్రం ఈ సినిమాని పెద్దగా ఎంజాయ్ చెయ్యలేరు.