Bengaluru: మరీ ఇలా ఉన్నారేంటి.. Blinkit నోటిఫికేషన్పై ఎంత రచ్చ చేశాడో చూడండి..!

సోషల్ మీడియా వేదిక అయిన ‘X’లో రోజుకు కొన్ని లక్షల పోస్టులు వైరల్ అవుతుంటాయి. భిన్నాభిప్రాయాలు, వాదప్రతివాదాలు ట్విటర్లో సర్వసాధారణం. కానీ.. కొన్నిసార్లు కొందరి ట్విటర్ పోస్టులు అసహనానికి, విద్వేషాలకు ఆజ్యం పోస్తుంటాయి. పరిస్థితి అదుపు తప్పిందని ట్విటర్ భావిస్తే ఆ పోస్ట్నే తొలగిస్తుంది. ఇప్పటికే ట్విటర్ కొన్ని పోస్టుల విషయంలో ఆ పని చేసింది కూడా. తాజాగా ట్విటర్లో అలాంటి అభ్యంతరకర పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. ట్విటర్లో రీచ్ కోసం అలాంటి పోస్ట్ పెట్టాడో లేక సీరియస్ గానే తను ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడో తెలియదు గానీ పోస్ట్ మాత్రం వైరల్ అయింది. కన్నడ భాషాభిమానిగా చెప్పుకుంటున్న ఒకతను సామాజిక మాధ్యమం అయిన ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టాడు. ‘Blinkit’ అనే యాప్ తనకు ఒక ప్రమాదకరమైన నోటిఫికేషన్ పంపిందని పోస్ట్ లో రాశాడు.  ‘‘Gaya’’ అని తనను సంబోధించిందని.. కన్నడలో ‘‘Gaya’’ అంటే ‘‘wound’’ అనే అర్థం వస్తుందని చెప్పుకొచ్చాడు. ‘‘wound’’ అంటే గాయం అని అర్థం. తాను గాయపడాలని ‘Blinkit’ భావిస్తుందని.. తనకు హాని కలిగించే ఇలాంటి నోటిఫికేషన్ మరొకటి పంపితే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సదరు వ్యక్తి ‘Blinkit’కు వార్నింగ్ ఇచ్చాడు.

ALSO READ | Zomato: 133 రూపాయల ఫుడ్కు 60 వేలు వదిలించుకున్న జొమాటో.. ఆ ఫుడ్ ఏంటంటే..

ఏలియన్ భాషలో ఇలాంటి నోటిఫికేషన్ పంపడం మానుకోవాలని ‘Blinkit’కు హితబోధ చేశాడు. ఇంతకీ ఆ ‘‘Gaya’’ నోటిఫికేషన్ గొడవేంటయ్యా అంటే.. "Deliver ho gaya" అని బ్లింకిట్ అతనికి నోటిఫికేషన్ పంపింది. "Dekho ye order 12 minutes mein deliver ho bhi gaya (See this order was delivered in just 12 minutes)" అని బ్లింకిట్ నోటిఫికేషన్ పంపడం సదరు కన్నడ భాషాభిమానికి నచ్చలేదు. వాస్తవానికి బ్లింకిట్ పంపిన మెసేజ్లో ఎలాంటి పరుష పదజాలం లేదు. తన మొబైల్లో  హిందీ నోటిఫికేషన్ కూడా రాకూడదని ఈ వ్యక్తి భావించడం వల్లే గొడవంతా వచ్చి పడింది. హిందీని ఏలియన్ లాంగ్వేజ్ అని అనడంతో పెను దుమారం రేగింది. ఈ ఒక్క పోస్ట్ వల్ల కన్నడ వర్సెస్ హిందీ అనే కోణంలో సోషల్ మీడియాలో వార్ మొదలైంది. ఒకరిపై ఒకరు మీమ్స్తో, ట్రోల్స్తో దుమ్మెత్తిపోసుకున్నారు. ఒక వ్యక్తి కన్నడ భాషపై అమితమైన అభిమానంతో, హిందీపై మితిమీరిన విద్వేషంతో పెట్టిన ఒక్క పోస్ట్ ఇంత రచ్చకు దారితీసింది.