Kannada Hero Darshan Arrest: మర్డర్ కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్

కన్నడ స్టార్ హీరో దర్శన్(Darshan) అరెస్ట్ అయ్యారు. హత్య కేసులో హీరో దర్శన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నటి  పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్లు పంపినందుకు గానూ రేణుకాస్వామి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య హీరో దర్శన్ సూచనల మేరకే జరిగిందని సమాచారం. ఆ కారణంగానే హీరో దర్శన్‌ని మైసూర్‌లోని ఫామ్‌హౌస్‌లో అరెస్టు  చేశారు పోలీసులు.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. కన్నడ స్టార్ దర్శన్‌ కొంతకాలంగా నటి పవిత్ర గౌడ సన్నిహితంగా ఉంటున్నాడని, ఈ ఇద్దరి మధ్య ఎదో జరుగుతోందని వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే రేణుక స్వామి అనే వ్యక్తి నటి పవిత్ర గౌడకు  అసభ్యకర మెసేజ్లు పంపి భయపెట్టాడని, ఈ విషయం దర్శన్ తెలిసి ఆ వ్యక్తి హతమార్చడానికి ప్లాన్ చేశాడని, కామాక్షిపాలెంలో రేణుకాస్వామి హత్య చేశారని, హత్య చేసిన నలుగురు నిందితులు అంగీకరించినట్లు సమాచారం. ఇక ఈ కేసులో హీరో దర్శన్ సహా 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.