స్టార్ హీరో క్యాన్సర్ సర్జరీ విజయవంతం.. థాంక్స్ అంటూ కూతురు ట్వీట్..

స్టార్ హీరో క్యాన్సర్ సర్జరీ విజయవంతం.. థాంక్స్ అంటూ కూతురు ట్వీట్..

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గత కొనేళ్ళుగా బ్లాడర్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. దీంతో ఇటీవలే సర్జరీ కోసం యునైటెడ్ స్టేట్స్‌లోని మియామీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ లో సర్జరీ కోసం వెళ్ళాడు.ఈ ఆపరేషన్ లో భాగంగా క్యాన్సర్‌తో ఉన్న బ్లాడర్‌ను పూర్తిగా తొలగించి కృత్రిమ మూత్రాశయాన్ని అమర్చడంతో సర్జరీ సక్సస్ అయినట్లు డాక్టర్ మురుగేష్ మనోహరన్ తెలిపాడు. దీంతో ఈ విషయాన్ని శివరాజ్ కుమార్ కూతురు నివేదిత శివరాజ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

ఇందులోభాగంగా "ఆ దేవుడి దయతో, మా నాన్నగారి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఆయన ప్రస్తుతం బాగానే ఉన్నారు, త్వరగానే కోలుకుంటున్నారు.  క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా నిర్వహించిన మియామీ హెల్త్‌కేర్‌లోని డాక్టర్ మురుగేష్ మనోహరన్‌కు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ క్యాన్సర్ ప్రయాణంలో మాకు అండగా నిలిచి మద్దతిచ్చినందుకు  డాక్టర్ మురుగేష్ మనోహరన్‌కు ధన్యవాదాలు.

ALSO READ | అనుమానాస్పద స్థితిలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మృతి..

ఇక తమ అభివమాన హీరో త్వరగా కోలుకుపోవాలని ప్రార్థనలు చేసిన అభిమానులకి పేరు పేరున ధన్యవాదాలు. సర్జరీ విజయవంతం కావడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు శివరాజ్ కుమార్ గురించి హెల్త్ అప్డేట్స్ తెలియజేస్తాము." అని ఎక్స్ లో ట్వీట్ చేసింది. దీంతో శివరాజ్ కుమార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే శివరాజ్ కుమార్ హీరోగా నటించిన భైరతి రణగళ్ తెలుగు, కన్నడ భాషలలో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం శివరాజ్ కుమార్ తెలుగులో ప్రముఖ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న RC16(వర్కింగ్ టైటిల్) సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి ఉప్పెన మూవీ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో జరుగుతోంది.