UI Box Office Collection Day 1: కన్నడ స్టార్ హీరో రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటించి దర్శకత్వం వహించిన యూఐ(UI) సినిమా శుక్రవారం రిలీజ్ అయ్యింది. ఈ సినిమా సైకలాజికల్ బ్యాక్ డ్రాప్ లో ఉపేంద్ర తెరకెక్కించాడు. దీంతో ఫ్యాన్స్ అంచనాలని ఏమాత్రం తారుమారు కాకుండా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో రవిశంకర్, రీష్మ,అచ్యుత్ కుమార్, నీతూ వనజాక్షి తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
అయితే ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం యూఐ సినిమా రిలీజ్ అయిన మొదటిరోజు డీసెంట్ కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా ఫ్యాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాగా మొదటిరోజు దాదాపుగా రూ.6.5 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఇందులో కన్నడలో అత్యధికంగా రూ.6 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక తెలుగు లో రూ.70 లక్షలు, తమిళ్ లో రూ.4 లక్షలు, హిందీలో రూ.1.25 లక్షలు రాబట్టింది.
ALSO READ : అర్జున్ రెడ్డి సినిమాతో పోలిక లేదు : ఐశ్వర్య శర్మ
శుక్రవారం మార్నింగ్ షో తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో మధ్యాహ్నం, మ్యాట్నీ షోలకి ఆడియన్స్ క్యూ పెరిగారు. దీంతో కలెక్షన్లు కూడా బాగానే పెరిగాయి. పాజిటివ్ టాక్ ఉండటం, వీకెండ్ సెలవులు ఉండటంతో శని ఆదివారాల్లో దాదాపుగా రూ.50 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
యూఐ సినిమా స్టోరీ:
అయితే యూఐ సినిమా స్టోరీ విషయానికొస్తే సత్య(ఉపేంద్ర) మూవీ డైరెక్టర్ గా పని చేస్తుంటాడు. సత్యకి సమాజంలో జరుగుతున్న సంఘటనల కారణంగా అంతర్గత సంఘర్షణతో బాధ పడుతుంటాడు. ఈ క్రమంలో తానే యూఐ సినిమా తీసి రిలీజ్ చేస్తాడు. ఈ సినిమా మీరు ఇంటెలిజెంట్స్ అయితే ఇప్పుడే సినిమా చూడకుండా బయటికెళ్ళవచ్చు, మీరు ఫూల్స్ అయితే ఫుల్ సినిమా చూడండి అంటూ టైటిల్ కార్డ్స్ తో ప్రారంభం అవుతుంది. అయితే సినీ విశ్లేషకుడు కిరణ్ ఆదర్శ్(మురళీ శర్మ) యూఐ సినిమా చూడటానికి వెళ్లి అర్థంకాక రివ్యూ రాయడానికి ఇబ్బంది పడుతుంటాడు. దీంతో ఈ యూఐ సినిమా దర్శకుడు సత్య ని కలిసి మాట్లాడేందుకు వెళ్తాడు. ఈ క్రమంలో యూఐ సినిమా గురించి షాకింగ్ నిజాలు తెలుసుకుంటాడు. అసలు ఈ సినిమాలో కల్కి భగవాన్ ఎవరు..? సత్య స్టోరీ ఏంటనేది తెలియాలంటే యూఐ సినిమా చూడాల్సిందే.