Kannada Veteran Actor Dwarakish Died: రజినీకాంత్ చిరకాల మిత్రుడు ద్వారకేష్ కన్నుమూత..తలైవా ఎమోషనల్ పోస్ట్

Kannada Veteran Actor Dwarakish Died: రజినీకాంత్ చిరకాల మిత్రుడు ద్వారకేష్ కన్నుమూత..తలైవా ఎమోషనల్ పోస్ట్

సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. కన్నడ ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత ద్వారకేశ్ (Dwarakish) (81) మంగళవారం (ఏప్రిల్ 16న)  కన్నుమూశారు. చాలా కాలంగా వయసు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో ఇవాళ ఆయన గుండెపోటుతో మరణించినట్లు ఆయన కుమారుడు మీడియాకు తెలిపారు. బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్రంలో ఆయన అంతక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ద్వారకీష్ కెరీర్ విషయానికి వస్తే..మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తయిన తర్వాత సోదరుడుతో కలిసి ఆటో విడిభాగాల వ్యాపారం ప్రారంభించారు. ఆ వెంటనే మైసూర్‌లో ఆటో స్పేర్‌ పేరుతో ఒక షాప్ ని ఓపెన్ చేశాడు.ఇక ఆ తర్వాత తన మామగారు హున్సూరు కృష్ణమూర్తి ప్రోత్సహంతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు.1966లో, తుంగ బ్యానర్స్‌లో మమతాయ్ బంధన్ చిత్రానికి సహ నిర్మాతగా మారారు.దీంతో ఆయన వెనక్కి చూసుకోకుండా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. 

ద్వారకేశ్ మృతి పట్ల కన్నడ సినీ అభిమానులు, సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ తన మిత్రుడిని కోల్పోయానంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. 

"నా చిరకాల మిత్రుడు ద్వారకేశ్ మరణ వార్త విని నాకు ఎంతో బాధ కలిగింది.. కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి..అంచలంచెలుగా ఎదిగి.. నిర్మాత, దర్శకుడిగా విజయాలు అందుకున్నాడు.ద్వారకేశ్‌తో గడిపిన ఎన్నో క్షణాలు నా మనసుని తడుతున్నాయి.. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను" అంటూ రజినీకాంత్ ట్వీట్ వైరల్ అవుతోంది. 

అయితే రజినీకాంత్ నటించిన చంద్రముఖి మూవీ పట్టాలెక్కేందుకు ముఖ్య కారణం ఇతనేనంటూ నాటి రోజుల్ని నెటిజన్లు గుర్తు చేసుకుంటు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.