Prabhas: ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. కన్నప్పలో డార్లింగ్ క్యారెక్టర్ ఏంటంటే?

Prabhas: ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. కన్నప్పలో డార్లింగ్ క్యారెక్టర్ ఏంటంటే?

మంచు వారి కలల ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa) నుంచి ప్రభాస్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. నేడు సోమవారం (ఫిబ్రవరి 3న) కన్నప్ప సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్కి సంబంధించిన పోస్టర్ షేర్ చేశారు. ఈ విషయాన్ని కన్నప్ప మూవీ టీమ్ Xలో అధికారికంగా వెల్లడించింది. కన్నప్పలో 'రుద్ర' గా హీరో ప్రభాస్ నటిస్తున్నట్లు మేకర్స్ కన్ఫమ్ చేశారు.

ALSO READ : SandeepReddyVanga: అర్జున్‍ రెడ్డికి సాయిపల్లవిని అనుకున్నా.. స్లీవ్‍లెస్సే వేసుకోదన్నారు

కన్నప్పలో 'రుద్ర' గా రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నట్లు ప్రభాస్ పోస్టర్ను ఆవిష్కరించారు. "ఇది కన్నప్పలో దైవిక బలం, జ్ఞానం మరియు రక్షకుడి శక్తి. భక్తి, త్యాగం మరియు అచంచలమైన ప్రేమ యొక్క అసాధారణ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఈ పురాణ గాథను ఏప్రిల్ 2025లో వెండి తెరపై చూడండి! " అంటూ మేకర్స్ వివరాలు వెల్లడించారు.

'ప్రళయ కాల రుద్రుడు.. త్రికాల మార్గ దర్శకుడు.. శివాజ్ఞ పరిపాలకుడు' అంటూ మేకర్స్ పోస్టర్ పై క్యాప్షన్ ఇచ్చారు. దాంతో ప్రభాస్ కన్నప్పలో ఎలాంటి పవర్ ఫుల్ రోల్ చేయనున్నాడో అర్ధమైపోయింది. ఈ కొత్త లుక్కి డార్లింగ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

అయితే, మొదట ప్రభాస్ శివుడి పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఇటీవలే కన్నప్ప టీమ్ 'శివుడి పాత్రలో' అక్షయ్ కుమార్ నటిస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో కన్నప్పలో ప్రభాస్ నందిగా కనిపిస్తున్నట్లు మరో వార్తా వైరల్ అయింది. ఇక లేటెస్ట్ అప్డేట్ తో ప్రళయ రుద్రుడి పాత్రలో ప్రభాస్ విశ్వరూపం చూపించబోతున్నట్లు క్లారిటీ వచ్చింది.

ఇకపోతే ఈ ప్రెస్టీజియస్ మూవీని ‘మహాభారతం’ టీవీ సిరీస్‍ను తెరకెక్కించిన ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. మోహన్ బాబు నిర్మిస్తున్నారు. 2025 ఏప్రిల్ 25న ఈ మూవీ రిలీజ్ చేయనున్నట్టు ఇదివరకే ప్రకటించారు.

తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ తో పాటు కాజల్, అక్షయ్ కుమార్, మోహన్‌‌‌‌ లాల్, శివరాజ్ కుమార్ లాంటి బిగ్ స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, శరత్‍కుమార్, దేవరాజ్, ఐశ్వర్య, ముకేశ్ రుషి ఇతర పాత్రలు  పోషిస్తున్నారు.