ప్రమోషన్స్ షురూ చేసిన కన్నప్ప టీమ్.. పాన్ ఇండియా సినిమాతో హిట్ కొడతారా..?

టాలీవుడ్ స్టార్ హీరో  మంచు విష్ణు  హీరోగా నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’.  ఈ సినిమాకి బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సీనియర్ హీరో, ప్రొడ్యూసర్  మోహన్ బాబు నిర్మిస్తునాడు. ఈ సినిమాలో మోహన్ లాల్, మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ఈ సినిమా ఏప్రిల్‌ 25న సినిమా విడుదల కానుంది. దీంతో కన్నప్ప టీమ్ ప్రమోషన్స్​ను బెంగళూరులో ప్రారంభిం చారు.  

ఈ సందర్భంగా హీరో మంచు విష్ణు మాట్లాడుతూ ‘ఈ తరానికి కన్నప్ప గొప్పతనం గురించి చెప్పాలని ఈ సినిమా తీశామని,   శివుని ఆజ్ఞతోనే  ఇది ప్రారంభమైందని భావిస్తున్నానని అన్నాడు.  ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన తమిళ్ హీరో శరత్ కుమార్ మాట్లాడుతూ ‘కన్నప్ప గురించి తెలియని ఎన్నో విశేషాల్ని ఇందులో చూపించబోతున్నారు. నాస్తికులు ఆస్తికులు అనే కాన్సెప్ట్​ను ఇందులో చూస్తారని చెప్పారు. ఇందులోని మూడు పాటలకు కొరియోగ్రఫీ చేసినట్టు ప్రభుదేవా చెప్పారు.  

‘మోహన్ లాల్, మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్ లాంటి  గొప్ప ఆర్టిస్టులంతా ఈ సినిమా కోసం పనిచేశారు.   విజువల్ ట్రీట్ ఇచ్చేలా సినిమా ఉంటుందని దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెలిపాడు.  కర్ణాటకలో ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉందని రాక్‌లైన్ వెంకటేష్ సంతోషం వ్యక్తం చేశారు.