మంచు విష్ణు(Manchu Vishnu) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప(Kannappa). మహా శివ భక్తుడైన కన్నప్ప కథ ఆధారంగా వస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా కోసం మేకర్స్ రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతున్నాయి. అందుకే ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. షూటింగ్ కూడా దాదాపు కంప్లీట్ అవడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు కన్నప్ప టీమ్.
We showcased the teaser of *Kannappa* here in Cannes, and it received an overwhelmingly positive response! International distributors, local Indians, and everyone who saw it absolutely loved it. I am excited and have butterflies in my stomach after witnessing such fantastic… pic.twitter.com/phnLbaKhdY
— Vishnu Manchu (@iVishnuManchu) May 21, 2024
ఇందులో భాగంగానే తాజాగా ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిశారు కన్నప్ప టీమ్. ప్రస్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2024 జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిన్న జరిగిన హారిజన్: యాన్ అమెరికన్ సాగా స్క్రీనింగ్ లో పాల్గొన్నారు కన్నప్ప టీమ్. అయితే ఇదే స్టేజిపై కన్నప్ప టీజర్ కూడా ప్లే చేశారట. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు హీరో మంచు విష్ణు. కన్నప్ప’ మూవీ టీజర్‌ను ప్రతిష్ఠాత్మక కేన్స్‌లో ప్రదర్శించాము. టీజర్ కు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్‌లు, ఇక్కడి లోకల్ ఇండియన్స్, ప్రతి ఒక్కరికి టీజర్ చాలా నచ్చింది. అది చూసి చాలా ఆనందంగా అనిపించింది. టీజర్ జూన్ 13న రిలీజవుతుంది, మే 30న హైదరాబాద్ లోని ప్రముఖ థియేటర్లో కన్నప్ప తెలుగు వెర్షన్ టీజర్ విడుదల అవుతుంది అంటూ తెలిపారు మంచు విష్ణు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.