బీఆర్ఎస్కు కన్నాపూర్ సర్పంచ్, మాజీ జడ్పీటీసీ రాజీనామా

కడెం, వెలుగు: మండలంలోని కన్నాపూర్ గ్రామ సర్పంచ్ నరేందర్ రెడ్డి, కడెం మాజీ జడ్పీటీసీ తక్కెళ్ల రాధా సత్తన్న, పార్టీ వైస్ ప్రెసిడెంట్ కన్నె శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అదివారం ప్రకటించారు. కడెం మండలంలోని హరిత రిసార్ట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  వారు మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో అసహనానికి గురైనట్లు వారు తెలిపారు.

20 ఏండ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న తమకు సరైన గుర్తింపు లేదని వాపోయారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ రుణం తీర్చు కోవడానికి తాము  కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. ఖానాపూర్​ఎమ్మెల్యే అభ్యర్థిగా పారాషూట్ వ్యక్తి జాన్సన్ నాయక్​కు టికెట్ ఎలా కేటాయించారని ప్రశ్నించారు. బీఆర్ఎస్​ను నియోజకవర్గంలో ఓడిస్తామన్నారు. ఉపసర్పంచ్ మంచినీళ్ల సతీశ్, నాయకులు రాజు, సాయి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.