తొర్రూరు/మంగపేట/కాశీబుగ్గ, వెలుగు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని ఓంకారేశ్వర ఆలయ ప్రాంగణంలో కన్నెస్వాముల పూజను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామి మాజేటి నరసింహారావు, ఆలయ నిర్వాహకులు రేణికుంట్ల శివ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాభిషేకం, సుగంధ ద్రవ్యాలు, పసుపు కుంకుమ, విభూది, గంధంతో అభిషేకాలు చేశారు.
స్వామి వారి పాటలు, శరణుఘోషతో సందడి నెలకొంది. అనంతరం నాగరాజు, మణిరాజ్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. అలాగే ములుగు జిల్లా మంగపేట మండలం బోర్ నర్సాపురంలో బండపెళ్లి రవీందర్ ఆధ్వర్యంలో విశేష పడిపూజ నిర్వహించారు. వరంగల్ సిటీలోని ఉర్సు శ్రీనాగేశ్వరస్వామి ఆలయంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో పడిపూజ, అన్నదానం చేశారు.