కాన్పూర్ మేయర్పై ఎఫ్ఐఆర్ నమోదు

కాన్పూర్ మేయర్పై ఎఫ్ఐఆర్ నమోదు

కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే చిక్కుల్లో పడ్డారు. ఓటు హక్కు వినియోగించుకుంటున్న సమయంలో ఆమె పోలింగ్ బూల్ లోపల ఫోటోలు తీశారు. అంతటితో ఆగకుండా వాట్సప్ గ్రూప్ లలో షేర్ చేయడం వివాదాస్పదంగా మారింది. యూపీ మూడో దశ ఎన్నికల్లో భాగంగా ప్రమీలా పాండే కాన్పూర్ లోని హడ్సన్ స్కూల్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.  ఓటు వేస్తున్న సమయంలో ఈవీఎంను ఫోటోలు తీసిన ఆమె. వాట్సప్లో షేర్ చేశారు. దీనిపై ఫిర్యాదు అందడంతో డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ స్పందించారు. మేయర్ ప్రమీలాపై చర్యలు తీసుకున్నారు. ఓటు గోప్యత నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్లు ప్రకటించారు. 

 

For more news..

జస్టిస్ ఫర్ పీఆర్సీ అంటూ టీచర్ల ఆందోళన

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: మోడీ