IND vs BAN 2024: అంతా అబద్ధం: బంగ్లా వీరాభిమానిపై దాడి జరగలేదట

కాన్పూర్‌లో భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజున టైగర్ రోబీ అనే బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానిపై భారతీయులు దాడి చేశారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలను అసిస్టెంట్ పోలీస్ కమిషనర్  కళ్యాణ్‌పూర్ అభిషేక్ పాండే ఖండించారు. అతను అస్వస్థతకు గురయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

"మ్యాచ్ సమయంలో టైగర్ అనే వ్యక్తి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. అతను డీ హైడ్రేషన్ కు గురయ్యాడు. దీంతో వైద్య బృందం సహాయంతో అతన్ని ఆసుపత్రికి పంపారు. ఇప్పుడు అతని ఆరోగ్యం బాగానే ఉంది. అంతే కాకుండా అతని వద్ద లైజన్ అధికారిని నియమించారు. అతనికి ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే సహాయాన్ని అందించే వెసులుబాటు కల్పించారు". అని పోలీసులు తెలిపారు. అభిమాని కూడా అనారోగ్యానికి గురయ్యాడని అంగీకరించాడు. అతను ఖుల్నా జిల్లాకు చెందినవాడని పోలీసులు వెల్లడించారు.

ALSO READ | SL vs NZ 2024: 8 టెస్టుల్లోనే 1000 పరుగులు.. బ్రాడ్ మన్ సరసన కామిందు మెండీస్

అసలేం జరిగిందంటే..?
 
బంగ్లాదేశ్ వీరాభిమాని టైగర్ రోబీని గ్రీన్ పార్క్ స్టేడియంలో కొంతమంది ప్రేక్షకులు పొత్తికడుపు కింది భాగంలో కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అతన్ని అక్కడ ఉన్న స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారు తన వీపు మీద, పొత్తికడుపుపై కొట్టారని ఆ సమయంలో తాను ఊపిరి పీల్చుకోలేకపోయాయనని స్పోర్ట్‌స్టార్ రాబి చెప్పినట్టు భద్రతా సిబ్బంది తెలిపారు. రెండో టెస్టు తొలి రోజు ఆటలో గ్రీన్ పార్క్ స్టేడియంలో బంగ్లాదేశ్ జెండాను ఊపుతూ సి-బ్లాక్ బాల్కనీ నుంచి నినాదాలు చేస్తూ రోబీ కనిపించాడు. లంచ్ సమయంలో, కొంతమంది స్థానిక ప్రేక్షకులు తనను కొట్టారని రోబీ ఆరోపించాడు, అయితే స్థానిక పోలీసు అధికారులు అధికారిక సిసిటివి ఫుటేజీని ధృవీకరించి అతని ఆరోపణలను పరిశీలిస్తారని చెప్పారు.