
కన్సాస్: అమెరికాలోని మిస్సోరీ కన్సాస్ సిటీలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు మృతిచెందారు. స్పాట్లోనే ఇద్దరు మృతిచెందారని మూడో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు.
మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించామని, ఇందులో ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉందని కన్సాస్ సిటీ పోలీస్‌లు చెప్పారు. ఇండియానా ఎవెన్యూ క్లైమాక్స్ లాంజ్‌లో శనివారం అర్ధరాత్రి దాటాక సుమారు1:25 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. .
బార్లోనే ఒకరు మరణించారని మరో వ్యక్తి బార్ బయట చనిపోయినట్లు డ్రేక్ వివరించారు. డిటెక్టివ్లు, క్రైమ్‌సీన్ ఇన్వెస్టిగేటర్స్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారని కన్సాస్ పోలీసులు వెల్లడించారు.