కాంతార, కార్తికేయ 2 సినిమాలకు నేషనల్ అవార్డ్స్

కాంతార, కార్తికేయ 2 సినిమాలకు నేషనల్ అవార్డ్స్

70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. ఇందులోభాగంగా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అధ్యక్షతన ఈరోజు (అక్టోబర్ 8) న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో చలన చిత్ర పరిశ్రమలో ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు ప్రధానం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. 

అయితే తెలుగులో స్టార్ హీరో నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 చిత్రానికి బెస్ట్ తెలుగు ఫిల్మ్ విభాగంలో జాతీయ అవార్డు దక్కింది. కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. మిస్టరీ మరియు యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

ALSO READ | SinghamAgain: లిమిట్ పెంచేసి రికార్డ్ సృష్టించిన సింగం ఎగైన్

ఇక కన్నడలో రిషబ్ శెట్టి నటించిన కాంతార చిత్రానికి కూడా రెండు అవార్డులు లభించాయి. ఇందులో ఉత్తమ నటుడి విభాగంలో రిషబ్ శెట్టి, బెస్ట్ పాపులర్ సినిమా విభాగంలో కాంతార చిత్రానికి నేషనల్ అవార్డులు లభించాయి. ఈ చిత్రం పాన్ ఇండియా భాషలలో విడుదల చెయ్యగా పెద్ద హిట్ అయ్యింది. ఈ క్రమంలో దాదాపుగా రూ.450 కోట్లు(గ్రాస్) వసూళ్లు సాధించింది. 

రిషబ్ శెట్టి మాట్లాడుతూ కాంతారా చిత్రానికి రెండు అవార్డులు రావడంతో ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే రీజినల్ చిత్రాలని అవార్డులతో ప్రోత్సహిస్తే ఎంతోమంది దర్శకనిర్మాతలు సినిమాలు చెయ్యడానికి ముందుకు వస్తారని అన్నారు.