అఫీషియల్ అనౌన్స్ మెంట్: మహారాజ్ ఛత్రపతి శివాజీ పాత్రలో కన్నడ స్టార్....

అఫీషియల్ అనౌన్స్ మెంట్: మహారాజ్ ఛత్రపతి శివాజీ పాత్రలో కన్నడ స్టార్....

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన "కాంతార" సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాగా దాదాపుగా రూ.450 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో రిషబ్ శెట్టి కి పాన్ ఇండియా సినిమాల్లో నటించే ఆఫర్లు వరిస్తున్నాయి. 

హైందవ ధర్మ పరిరక్షణ కోసం పోరాడి ప్రాణాలు వదిలిన మహారాజ్ ఛత్రపతి శివాజీ పాత్రలో నటించే ఆఫర్ ని దక్కించుకున్నాడు.. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి "ఛత్రపతి శివాజీ మహారాజ్" అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకి ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సందీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 

Also Read :- పెరుగుతున్న ఛావా మూవీ కలెక్షన్స్

నేడు ఛత్రపతి శివాజీ జయంతి కావడంతో ఈ సినిమాని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయానికి సంబంధించిన పోస్టర్ కూడా షేర్ చేశారు. ఇందులో భవాని దేవత ఎదురుగా రిషబ్ శెట్టి ఖడ్గం ధరించి పవర్ఫుల్ లుక్ లో కనిపించాడు.

ఈ సినిమా దర్శకుడు సందీప్ సింగ్ గతంలో రౌడీ రాథోడ్ (విక్రమార్కుడు హిందీ రీమేక్), మేరీ కోమ్ (బయోపిక్), గబ్బర్ ఈజ్ బ్యాక్, తదితర సినిమాలకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అంతేగాకుండా పలు చిన్న బడ్జెట్ సినిమాలని నిర్మించాడు.