తిరుమల బ్రహ్మోత్సవాల్లో కాంతారా నృత్యాలు

తిరుమల బ్రహ్మోత్సవాల్లో కాంతారా నృత్యాలు

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల (tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. తిరుమలలో (tirumala) శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో గజ వాహన సేవ రోజున   దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 15 మంది సైనికులకు చెందిన 400 మంది కళాకారులు అరుదైన కళారూపాలను ప్రదర్శించారు. 

తొమ్మిదిరోజుల పాటు జరిగిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు గజవాహన సేవలతో ముగిశాయి. తిరుమల వేంకటేశ్వరుడి వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవలు కోలాహలంగా జరిగాయి.  బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన భక్తులను ఈ ప్రదర్శనలు మంత్ర ముగ్ధులను చేశాయి. 


 
తిరుమలకు (tirumala) విశేషంగా విచ్చేసిన భక్తులు (devotees) అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. పద్మావతి, పద్మజ, వైష్ణవి, మహాలక్ష్మి అనే నాలుగు ఏనుగులను  ఊరేగించగా, భక్తులు  తమ ఆటపాటలు, నృత్యాలతో శోభాయమానంగా మారడంతో  తిరుమాడ వీధుల్లో  ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గజవాహన సేవ భక్తులు, సంగీత కళాకారులు స్వామివారి భక్తి గీతాలను  ఆలపించారు.   ఎస్వీ సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థులు గజేంద్రమోక్షం, కాంతారావు జానపద నృత్యాలను అలరించారు.

తణుకుకు చెందిన ఎన్.రాధిక ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన, తిరుపతికి చెందిన వంశీధర్ రెడ్డి బృందంచే గోపిక నృత్యం, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన ఎన్ .సరస్వతి బృందం డ్రమ్ముల నృత్యం, కర్ణాటకకు చెందిన జ్యోతి ఎన్ .హెగ్డే దాస సంకీర్తన నృత్యం అల‌రించాయి. అదేవిధంగా, విశాఖపట్నంకు (visakhapatnam) చెందిన డీవీఎల్. శిరీష బృందం కోలాటం, రాజమండ్రికి చెందిన డి.గాయత్రి బృందం ప్రదర్శించిన గోపికా కృష్ణుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.

పైన పేర్కొన్న ప్రదర్శనలే కాకుండా విశాఖపట్నంకు చెందిన బి సాయి రోజా కుమారి ప్రదర్శించిన కోలాటం, పాండిచ్చేరికి చెందిన ఎస్.మాలతి సెల్వం ఆధ్వర్యంలో ప్రదర్శించిన పొయికల్ కుదిరై, హర్యానా ప్రాంతానికి చెందిన పి.రాజి బృందం ప‌న్హారీ నృత్యం, విజయవాడకు (vijayawada) చెందిన వై.వనజ బృందం కోలాటం, తిరుమల (tirumala) బాలాజీ నగర్  కె.శ్రీనివాసులు బృందం కోలాటం భక్తులను (devotees) ఎంతగానో ఆక‌ట్టుకున్నాయి. బెంగుళూరు నుండి ఎన్ నాగేంద్ర సాంస్కృతిక దళం ద్వారా పాటకునిత,  తిరుపతికి చెందిన కవిత,  నెల్లూరుకు చెందిన ఉమారాణి నృత్య బృందాలు ప్రదర్శించిన కోలాటం,  శ్రీకాకుళం నుండి శోభ కుమార్ దళం చేసిన నెమలి నృత్యం భక్తులను మంత్రముగ్ధులను చేసింది.

ఇంకా  ద్వారంపూడికి చెందిన కె రాజు బృందంచే జానపద నృత్యంతో సహా వివిధ నృత్యాలు,  విశాఖపట్నం నుండి జె రజిత నృత్య బృందంచే కోలాటం నృత్యం, తిరుపతికి చెందిన మురళీకృష్ణ డ్యాన్స్‌ ట్రూప్‌చే తొమ్మిది రూపాల్లో ఉన్న దుర్గామాత నృత్యం కూడా వీక్షకులను ఆకట్టుకుంది.