ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభ మేళాలో రోజుకో విచిత్ర బాబా దర్శనమిస్తున్నాడు. ఇటీవలే ఐఐటీ బాబా వార్త వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ముళ్లపై పడుకునే బాబా దర్శనం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
మహా కుంభ మేళాలో రుద్రాక్ష బాబా, ఐఐటీ బాబా, ఇంజినీర్ బాబా అంటూ ర కరకాల బాబాలు కుంభమేళాలో దర్శనం ఇస్తున్నారు. తాజాగా అయితే తాజాగా ‘కాంటే వాలే’ బాబాగా పిలువబడే మరో బాబా అందరి దృష్టిని ఆకర్షించాడు. ముళ్లపై పడుకునే బాబా దర్శనం ఇచ్చీ వైరల్ అయ్యాడు.
‘కాంటే వాలే’ బాబా అసలు పేరు రమేష్ కుమార్ మాంఝీ. కాంటే అంటే హిందీలో ముళ్లు అని అర్థం. ముళ్లపై పడుకుంటాడు కాబట్టి.. కాంటేవాలే బాబాగా పేరు వచ్చింది ఈ బాబాకు. పదునైన ముళ్ల పాన్పుపై అలవోకగా పడుకోవడం ఈయన గొప్పతనం. పూల పాన్పు పై పడుకున్నట్లుగా.. పదునైన ముళ్లపాన్పుపై పడుకుంటాడు. గత 40 నుంచి 50 సంవత్సరాలుగా అతడి ముళ్ల మీదనే పడుకుంటున్నాడట.
Also Read : మహాకుంభమేళాలో బ్యూటీ క్వీన్ మోనాలిసా
‘నాకు ముళ్ల పాన్పుపై పడుకునే శక్తిని అందించింది ఆ భగవంతుడే. ఎటువంటి బాధ లేకుండా దీన్ని భరిస్తున్నానంటే దీనికి కారణం భగవంతుడి మహిమే. ఇలా ముళ్లపై పడుకోవడం వల్ల నా శరీరానికి ఎలాంటి హానీ కలగదు.’’ అని ఈ ముళ్ల బాబా భక్తులతో అన్నారు.