![హైదరాబాద్‌లో భారీ డైకిన్ షోరూమ్](https://static.v6velugu.com/uploads/2023/10/kanwaljeet-jawa-officially_zrXEU6ZL3b.jpg)
- శ్రీసిటీలో మూడో ప్లాంట్
- రూ.2 వేల కోట్ల పెట్టుబడి
- వెల్లడించిన డైకిన్ ఎండీ జావా
హైదరాబాద్, వెలుగు : దక్షిణ భారతదేశంలో అతిపెద్ద డైకిన్ షోరూమ్ ‘శ్రీ కంఫర్ట్ ఎయిర్ ప్రొడక్ట్స్, సర్వీసెస్’ను డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కన్వల్జీత్ జావా సికింద్రాబాద్లో బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ మూడో ప్లాంట్ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇక్కడ 20 లక్షల ఏసీలను తయారు చేస్తామని, ప్లాంటు కోసం రూ.రెండు వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు.
ఈ ఏడాది నవంబర్ 23న దీనిని ప్రారంభిస్తారు. తాము 150 దేశాలలో ప్రొడక్టులను అమ్ముతున్నామని జావా అన్నారు. భారతదేశంలో గత సంవత్సరం ఒక బిలియన్ డాలర్ల టర్నోవర్ సాధించామని చెప్పారు. పంపిణీ అభివృద్ధి, డీలర్ల కన్సాలిడేషన్, డీలర్ లాయల్టీ ప్రోగ్రామ్‌లు తమ విజయానికి కీలకమన్నారు. ఈ పండుగ సీజన్‌లో డైకిన్ ఏసీలపై ఈఎంఐ, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉన్నాయని శ్రీ కంఫర్ట్ తెలిపింది. పాత ఏసీకి రూ. ఆరు వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చుని పేర్కొంది.