4కిలోల బంగారంతో అలంకరణ: మహాలక్ష్మిగా కన్యకా పరమేశ్వరీ

4కిలోల బంగారంతో అలంకరణ: మహాలక్ష్మిగా కన్యకా పరమేశ్వరీ

కన్యకా పరమేశ్వరీ అమ్మవారికి నాలుగు కిలోల నగలతో, రెండు కోట్ల రూపాయలతో అలంకరించారు భక్తులు. ఈ ఆలయం ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నంలోని వన్ టౌన్ ఏరియాలో ఉంది. ఈ రోజు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు కన్యకా పరమేశ్వరీ దేవీ. ఈ అలంకరణలో పలు ఆభరణాలతో పాటు 500, 2000రూపాయల నోట్లతో అమ్మవారి మూర్తిని అలంకరించారు. పొద్దున  అమ్మవారికి విశేష పూజలు జరిగిన తరువాత భక్తులు అధికసంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.