Kapil Dev: 10 నెలలు మైదానంలోనే ఆటగాళ్లు.. బీసీసీపై కపిల్ దేవ్ ఆగ్రహం

Kapil Dev: 10 నెలలు మైదానంలోనే ఆటగాళ్లు.. బీసీసీపై కపిల్ దేవ్ ఆగ్రహం

టీమిండియా స్టార్ పేసర్ జస్​ప్రీత్​ బుమ్రా వెన్ను గాయం కారణంగా ట్రోఫీకి దూరమయ్యాడు. మంగళవారం వరకు ఎన్​సీఏలో రిహాబిలిటేషన్​లో ఉన్న బుమ్రా పూర్తి ఫిట్​నెస్​ సాధించలేకపోయాడు. మెడికల్​ పరంగా ఫిట్​గా ఉన్నట్లు  తేలినా.. బౌలింగ్​ ఫిట్​నెస్​పై ఎన్‌సీఏ క్లియరెన్స్ ఇవ్వలేదు.  దీంతో బుమ్రా చాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ప్రకటించారు. 

బుమ్రా దూరం కావడంతో ప్రపంచ కప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ భారత క్రికెటర్లలో పెరుగుతున్న గాయాలపై ఆందోళన వ్యక్తం చేశాడు. కపిల్ దేవ్ మాట్లాడుతూ.." ఆటగాళ్లను సంవత్సరానికి దాదాపు 10 నెలలు మైదానంలో ఉంచే కఠినమైన షెడ్యూల్‌ను తప్పుబట్టాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ పునరావాస కేంద్రంగా మారిందని, ఆటగాళ్ళు శిక్షణ కంటే కోలుకోవడానికి ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

ALSO READ | Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పంజాబ్ సీఎంని కలిసిన స్టార్ క్రికెటర్లు

ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రాను మిస్ అవుతారా అని కపిల్ దేవ్ ను అడిగినప్పుడు   కపిల్ ఇలా అన్నాడు.. "జట్టులో లేని వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడాలి? ఇది జట్టుగా గెలవాల్సిన ఆట. ఒక ఆటగాడిపై ఆధారపడే   బ్యాడ్మింటన్, టెన్నిస్, గోల్ఫ్ కాదు. మనం ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టుగా ఆడితే ఖచ్చితంగా గెలుస్తాము. ప్రధాన ఆటగాళ్ళు గాయపడాలని ఎవరూ కోరుకోరు. అలా జరిగితే దానికి ఎవరూ ఏమీ చేయలేరు. భారత జట్టుకు నా శుభాకాంక్షలు. వెళ్లి బాగా ఆడండి. అని 66 ఏళ్ల కపిల్ చెప్పుకొచ్చాడు. 

వన్డే ఫార్మాట్ లో టాప్ 8 జట్లు ఆడే ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరుగుతుంది. పాకిస్తాన్‌,దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. పాకిస్థాన్ లోని లాహోర్, కరాచీ, రావల్పిండి ఎనిమిది జట్లు ఆడే ఈ టోర్నమెంట్‌లో మొత్తం 10 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాకిస్తాన్‌,దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. పాకిస్థాన్ లోని లాహోర్, కరాచీ, రావల్పిండి ఎనిమిది జట్లు ఆడే ఈ టోర్నమెంట్‌లో మొత్తం 10 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

భారత జట్టు పాల్గొనే మ్యాచ్‌లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ గ్రూప్ ఏ లో ఉండగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ బి లో ఉన్నాయి. ఈ టోర్నీకి ముందు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఈ మెగా టోర్నీ గురించి తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నాడు.