Kapil Dev: కోహ్లీ గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేట్స్..ధోనీ కంటే గొప్పోడు: భారత మాజీ దిగ్గజ క్రికెటర్

Kapil Dev: కోహ్లీ గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేట్స్..ధోనీ కంటే గొప్పోడు: భారత మాజీ దిగ్గజ క్రికెటర్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో దాదాపు సగం రికార్డులు విరాట్ తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ రికార్డ్స్ ఒకొక్కటిగా బ్రేక్ చేస్తూ ఆల్ టైం బెస్ట్ బ్యాటర్ గా ముందకెళ్తున్నాడు. సమీప భవిష్యత్తులో కోహ్లీ రికార్డ్స్ బ్రేక్ చేయడం అసాధ్యం అనే దిశగా కోహ్లీ పరుగుల ప్రవాహం కొనసాగుతుంది. 36 ఏళ్ళ వయసులో అత్యుత్తమ ఫిట్ నెస్ ప్రమాణాలతో క్రికెట్ లో అద్బుతంగా రాణిస్తున్నాడు. కోహ్లీ గొప్పతనం గురించి తాజాగా టీం టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ మాట్లాడాడు. 

ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ ఆట తీరు కపిల్ దేవ్ కు ఎంతగానో నచ్చింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాపై జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో కోహ్లీ ఇన్నింగ్స్ ను ప్రశంసించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కంటే కోహ్లీ గ్రేట్ అని కితాబులిచ్చాడు. కపిల్ దేవ్ మాట్లాడుతూ..  " కోహ్లీ గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేట్స్. అతను కఠిన పరిస్థితులను ఛాలెంజింగ్ గా భావించి ఇన్నింగ్స్ ను ముందు తీసుకెళ్తాడు. అతను అలా ఆడటానికి ఇష్టపడతాడు. చాలా తక్కువ మంది క్రికెటర్లు మాత్రమే కోహ్లీ లాంటి స్వభావం కలిగి ఉంటారు. ఒకప్పుడు ధోని అలా చేసేవాడని మనకు తెలుసు. కానీ కోహ్లీ అందరికంటే ఒక అడుగు ముందున్నాడు" అని కపిల్ దేవ్ అన్నారు.

ALSO READ : Champions Trophy 2025: కోహ్లీకే ఛాన్స్.. గోల్డెన్ బ్యాట్ రేస్‌లో ఆరుగురు క్రికెటర్లు

విరాట్ కోహ్లీ ఐసీసీ టోర్నీ అంటే అద్బుతంగా ఆడతాడనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కోహ్లీ తన హవా చూపిస్తున్నాడు. నాలుగు మ్యాచ్ ల్లో 72.33  సగటుతో  217 పరుగులు  చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన నాలుగో క్రికెటర్ గా కొనసాగుతున్నాడు. వీటిలో పాకిస్థాన్ పై చేసిన సెంచరీతో పాటు సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై చేసిన 84 పరుగుల మ్యాచ్ విన్నింగ్ నాక్ ఉంది. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఒత్తిడి తట్టుకొని కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ కపిల్ దేవ్ ను ఎంతగానో ఆకట్టున్నట్టు చెప్పాడు.