Kapil Dev: గిల్, రోహిత్ కాదు.. నా దృష్టిలో టీమిండియా కెప్టెన్ అంటే అతనే: కపిల్ దేవ్

Kapil Dev: గిల్, రోహిత్ కాదు.. నా దృష్టిలో టీమిండియా కెప్టెన్ అంటే అతనే: కపిల్ దేవ్

టీమిండియా వన్డే క్రికెట్ కెప్టెన్ గా ప్రస్తుతం రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. టీ20ల్లో హిట్ మ్యాన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానంలో సూర్య కుమార్ యాదవ్ కు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. వన్డేల్లో యువ బ్యాటర్ శుభమాన్ గిల్.. టీ20 ఫార్మాట్ లో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్సీ చేస్తున్నారు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు వైట్ బాల్ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తుంది. 9 నెలల వ్యవధిలో రోహిత్ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచింది. ఇదిలా ఉంటే మాజీ కెప్టెన్, దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యను కెప్టెన్ గా చేయాలనే తన కోరికను బయట పెట్టాడు. 

1983లో ఇండియాకు తొలిసారి ప్రపంచ కప్ టైటిల్‌ను అందించిన కపిల్ దేవ్ హార్దిక్ కు తన సపోర్ట్స్ తెలిపాడు. పాండ్యకు వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించాలని కోరాడు. కపిల్ దేవ్ మాట్లాడుతూ.. "నా దృష్టిలో హార్దిక్ పాండ్యా నా వైట్ బాల్ కెప్టెన్. ఆ పదవికి చాలా మంది పోటీదారులు ఉన్నప్పటికీ పాండ్యా నా ఎంపిక. పాండ్య చాలా చిన్నవాడు. అతను తదుపరి ఐసీసీ ఈవెంట్ల కోసం అతని చుట్టూ ఒక జట్టును నిర్మించగలడు. హార్దిక్ టెస్ట్ క్రికెట్ కూడా ఆడాలి. అతడు ఈ ఫార్మాట్ కు దూరంగా ఉండడంతో మూడు ఫార్మాట్ లకు బహుళ కెప్టెన్లు అవసరం" అని కపిల్ దేవ్ ముగించారు." అని కపిల్ మైఖేల్‌తో అన్నారు.

Also Read : బట్లర్ స్థానంలో వన్డే, టీ20లకు కెప్టెన్‌ను ప్రకటించిన ఇంగ్లాండ్ క్రికెట్!

హార్దిక్ పాండ్య భారత టీ20, వన్డే జట్టులో రెగ్యులర్ సభ్యుడు. రోహిత్ గైర్హాజరీలో గతంలో హార్దిక్ టీమిండియాను నడిపించాడు. హిట్ మ్యాన్ స్థానంలో టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ పాండ్య అనే గట్టి ప్రచారం జరిగింది. అయితే బీసీసీఐ మాత్రం అతనికి బిగ్ షాక్ ఇచ్చింది. కెప్టెన్సీ సంగతి పక్కనపెడితే కనీసం వైస్ కెప్టెన్ చేసే ఆలోచనలో కూడా లేనట్టు తెలుస్తుంది. పాండ్యకు తరచూ గాయాలు కావడమే ఇందుకు కారణం. ప్రస్తుతం పాండ్య ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా చేస్తున్నాడు. అతని సారధ్యంలో జట్టు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. అంతకముందు గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన పాండ్య తొలి రెండు సీజన్ లలో జట్టును ఫైనల్ కు తీసుకెళ్లాడు. 2022 లో హార్దిక్ కెప్టెన్సీలో గుజరాత్ ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది.