ధోనీ, సచిన్ మాత్రమే కాదు.. ఆ ఇద్దరు దిగ్గజాల స్థానాలనూ ఎవరు భర్తీ చేయలేరు: కపిల్ దేవ్

ధోనీ, సచిన్ మాత్రమే కాదు.. ఆ ఇద్దరు దిగ్గజాల స్థానాలనూ ఎవరు భర్తీ చేయలేరు: కపిల్ దేవ్

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఈ ఇద్దరు భారత క్రికెట్ లో తమదైన ముద్ర వేశారు. దశాబ్ద కాలంగా టీమిండియాకు కీలక బ్యాటర్లుగా ఎదిగారు. వీరిద్దరిలో ఒకరు క్రీజ్ లో కుదురుకున్నా ప్రత్యర్థులకు చుక్కలు కనబడాల్సిందే. టాపార్డర్ లో వచ్చి తమ విధ్వంసకర ఆటతీరుతో  మ్యాచ్ ను దాదాపు పూర్తి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒకేసారి టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత తన రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.

టీ20 క్రికెట్ లో నాలుగు వేలకు పైగా పరుగులు చేసిన వీరిద్దరూ ఏ ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో తొలి రెండు స్థానాల్లో ఉండడం విశేషం. తాజాగా ఈ రోహిత్, విరాట్ పై భారత మాజీ కెప్టెన్.. దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ ప్రశంసలు కురిపించారు. భారత జట్టులో ఏ ఫార్మాట్ లోనైనా కోహ్లీ, రోహిత్ ల స్థానాన్ని భర్తీ చేయలేరు. వీరిద్దరూ భారత క్రికెట్ కు ఎంతో సేవ చేశారు. టీ20 ఫార్మాట్ లో వీరికి అద్భుతమైన వీడ్కోలు లభించాయి. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీలా ఈ ఇద్దరిని రీప్లేస్ చేయడం కష్టం. అని కపిల్ తెలియజేశారు. 

Also Read :- 2026 టీ20 వరల్డ్ కప్‌కు సంజు శాంసన్‌ను ఎంపిక చేయరు

దేశం మొత్తం టీ 20 వరల్డ్ కప్ గెలిచిన సంబరాల్లో ఉండగా.. విరాట్ కోహ్లీ ఇదే నా చివరి టీ20 వరల్డ్ కప్ అని.. ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ మ్యాచ్ లకు సెలవు తీసుకుంటున్నట్లు ప్రకటించి.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. మరోవైపు రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం జరిగిన ఇంటర్వ్యూలో అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌ కు గుడ్ బై చెప్పాడు. వన్డే, టెస్టుల్లో కొనసాగుతానని తెలిపాడు. యంగ్ క్రికెటర్లకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే వెనక్కి తగ్గుతున్నట్లు తెలిపారు.