Kapil Dev: ఫ్యామిలీ వద్దంటూ ఆటగాళ్లను బాధపెట్టకూడదు.. బీసీసీఐకి కపిల్ దేవ్ సలహా

Kapil Dev: ఫ్యామిలీ వద్దంటూ ఆటగాళ్లను బాధపెట్టకూడదు.. బీసీసీఐకి కపిల్ దేవ్ సలహా

ఏదైనా విదేశీ టూర్ అనగానే.. భారత క్రికెటర్లు పెళ్లాం, పిల్లలతో వాలిపోతారన్న విషయం తెలిసిందే. గెలుపోటములు పక్కనపెట్టి.. ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి ఆయా నగర వీధుల్లో ఎంజాయ్ చేస్తుంటారు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సమయంలోనే అటువంటి సన్నివేశాలే కనిపించాయి. ఆటగాళ్లు ప్రాక్టీస్ కంటే.. కుటుంబానికే అధిక సమయం వెచ్చిస్తున్నందునే ఈ పరిమితులు విధించినట్లు తెలుస్తోంది. 

వరుసగా టెస్టుల్లో ఓడుతున్నా.. పరుగులు చేయడంలో విఫలమవుతున్నా భారత క్రికెటర్లలో ఎటువంటి నిరుత్సాహం కనిపించలేదు. ఆహ్ పోతే పోయిందిలే అన్నట్టు పెళ్లాం, పిల్లలతో కలిసి సిడ్నీ, బ్రిస్బేన్ నగర వీధుల్లో ఎంజాయ్ చేశారు. ఇటువంటి వాటిపై పదే పదే విమర్శలు వస్తుండటంతో బీసీసీఐ అప్రమత్తం అయ్యింది. మున్ముందు అటువంటి వాటికి తావు లేకుండా పరిమితులు విధించింది. ఈ విధానంపై ఇటీవలే టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేయగా తాజాగా భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ ఈ విషయంపై బీసీసీఐ సమతుల్యత విధానం ఆలోచించాలని సూచించాడు. 

ALSO READ | Shashank Singh: నెం.1 ఆల్ రౌండర్‌కు నో ఛాన్స్: పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 చెప్పిన శశాంక్ సింగ్

భారత క్రికెట్ జట్టు విదేశాలకు వెళ్తున్న సమయంలో కుటుంబం ప్రాధాన్యతను కపిల్ హైలైట్ చేసి మాట్లాడాడు." ఇది బీసీసీఐ పెట్టిన రూల్ ను గౌరవిస్తున్నా. ఇది బోర్డు వ్యక్తిగతానికి సంబంధించినది. అయితే బీసీసీఐ ఆటగాళ్ల గురించి కూడా ఆలోచించాలి. నా అభిప్రాయమేంటంటే మీకు కుటుంబం అవసరం. అదే సమయంలో జట్టు అంతకంటే ఎక్కువ అవసరం. మా కాలంలో మేము క్రికెట్ ఆడేటప్పుడు ఫస్ట్ హాఫ్ లో క్రికెట్ ఉండాలని.. సెకండా హాఫ్ లో కుటుంబం కూడా వచ్చేలా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అని మాలో మేము అనుకునేవాళ్లం. ఎవరినీ బాధపెట్టకుండా ఇది బ్యాలన్స్ గా ఉండాలి". అని కపిల్ దేవ్ గ్రాంట్ థోర్న్టన్ ఇన్విటేషనల్ ఈవెంట్ సందర్భంగా అన్నారు.  

బీసీసీఐ సూచించిన నియమాలు

టోర్నమెంట్‌ అంతటా భార్యలు ఆటగాళ్లతో కలిసి ఉండలేరు.

ఏదేని టోర్నీ 45 లేదా అంతకంటే ఎక్కువ రోజుల అయితే.. కుటుంబం 14 రోజులు మాత్రమే ఆటగాళ్లతో ఉండటానికి అనుమతి.

ఒకవేళ టోర్నీ అంతకంటే తక్కువగా ఉంటే.. 7 రోజులకు మాత్రమే అనుమతి. 

ఆటగాళ్లందరూ టీమ్ బస్సులో ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రత్యేక ప్రయాణం అనుమతించబడదు

ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వ్యక్తిగత మేనేజర్‌ని టీమ్ బస్సులో లేదా వీఐపీ బాక్స్‌లోకి అనుమతించరు. అతను వేరే హోటల్‌లో బస చేయాల్సి ఉంటుంది.

ఆటగాళ్ల లగేజీ 150 కిలోల కంటే ఎక్కువ ఉంటే బీసీసీఐ అదనపు లగేజీ ఛార్జీలు చెల్లించదు. అదనపు లగేజీ ఛార్జీలు ఆటగాడు భరించాల్సి ఉంటుంది.