IND vs AUS Final: వరల్డ్ కప్‌ఫైనల్లో ఓటమి.. కపిల్ దేవ్‌ను గుర్తు చేసుకున్న ఫ్యాన్స్

IND vs AUS Final: వరల్డ్ కప్‌ఫైనల్లో ఓటమి.. కపిల్ దేవ్‌ను గుర్తు చేసుకున్న ఫ్యాన్స్

భారత జట్టును తొలిసారి విశ్వ విజేతగా నిలిపిన ఘనత దిగ్గజ క్రికెటర్ కపి దేవ్ కే దక్కుతుంది. 1983 లో కపిల్ సారధ్యంలోని టీమిండియా అంచనాలు లేకుండానే వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. ఫైనల్లో విండీస్ పై 43 రన్స్ తేడాతో గెలిచి విశ్వ విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2011 లో ధోనీ సారధ్యంలో భారత్ కప్ గెలిచింది. ఈ రెండు వరల్డ్ కప్ క్షణాలు ప్రత్యేకమైనవే అయినా 1983 లో కపిల్ డెవిల్స్ సాధించిన ప్రపంచ కప్ చరిత్రలో నిలిచిపోతుంది. 

నిన్న(నవంబర్ 19) జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టు ఆస్ట్రేలియాపై ఓడిపోవడంతో అభిమానులు కపిల్ దేవ్ ను గుర్తు చేసుకున్నారు.కపిల్ దేవ్ ఈ మ్యాచ్ చూడడానికి వస్తే బాగుండేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో సాదా సీదాగా ఉన్న భారత జట్టును కపిల్ నడిపించిన తీరు అద్భుతమంటూ.. మిమ్మల్ని మిస్ అవుతున్నామంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భారత జట్టు పటిష్టంగా ఉన్నా ఒత్తిడి జయించలేక సొంతగడ్డపై ఓడిపోయిందంటూ  ఈ సందర్భంగా కపిల్ ను గుర్తు చేసుకున్నారు.

 ఈ మెగా ఫైనల్ కోసం గ్రాండ్ గా ఏర్పాట్లు చేసిన బీసీసీఐ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ల కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు.. ఈ గ్రాండ్ ఫైనల్ చూసేందుకు బీసీసీఐ, ఐసీసీ వీరిని ప్రత్యేకంగా ఆహ్వానించిందని వార్తలు వచ్చాయి. అయితే భారత కెప్టెన్ కపిల్ దేవ్ కు మాత్రం ఆహ్వానించలేదని తెలిపాడు. కపిల్ దేవ్ మాట్లాడుతూ “నన్ను వరల్డ్ కప్ ఫైనల్ కు ఆహ్వానించలేదు. వారు నన్ను పిలవలేదు కాబట్టి నేను వెళ్ళలేదు. 83 టీమ్ మొత్తం నాతో ఉండాలని నేను కోరుకున్నాను.  కానీ ఇది చాలా పెద్ద ఈవెంట్.   ప్రజలు చాలా బిజీగా ఉండటం వల్ల బాధ్యతలను నిర్వహించడం కొన్నిసార్లు వారు మరచిపోతారు. ”అని దేవ్‌ చెప్పుకొచ్చాడు.