అహ్మదాబాద్ వేదికగా ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మెగా ఫైనల్ కోసం గ్రాండ్ గా ఏర్పాట్లు చేసిన బీసీసీఐ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ల కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు.. ఈ గ్రాండ్ ఫైనల్ చూసేందుకు బీసీసీఐ, ఐసీసీ వీరిని ప్రత్యేకంగా ఆహ్వానించిందని వార్తలు వచ్చాయి.
వరల్డ్ కప్ ఫైనల్ చూసే సమయంలో ఈ లెజెండరీ కెప్టెన్లు అందరూ ఈ స్పెషల్ బ్లేజర్ వేసుకొంటారని తెలియజేసింది. అయితే భారత కెప్టెన్ కపిల్ దేవ్ కు మాత్రం ఆహ్వానించలేదని తెలిపాడు. కపిల్ దేవ్ మాట్లాడుతూ “నన్ను వరల్డ్ కప్ ఫైనల్ కు ఆహ్వానించలేదు. వారు నన్ను పిలవలేదు కాబట్టి నేను వెళ్ళలేదు. 83 టీమ్ మొత్తం నాతో ఉండాలని నేను కోరుకున్నాను. కానీ ఇది చాలా పెద్ద ఈవెంట్. ప్రజలు చాలా బిజీగా ఉండటం వల్ల బాధ్యతలను నిర్వహించడం కొన్నిసార్లు వారు మరచిపోతారు. ”అని దేవ్ చెప్పుకొచ్చాడు.
విండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్(1975,1979) కపిల్ దేవ్(1983), అలన్ బోర్డర్(1987), అర్జున రణతుంగ(1996), స్టీవ్ వా(1999), రికీ పాంటింగ్(2003,2007) ఎంఎస్ ధోనీ(2011), మైఖేల్ క్లార్క్(2015), ఇయాన్ మోర్గాన్(2019) ఈ లిస్టులో ఉన్నారు. వీరిలో బీసీసీఐ ఎంతమందిని పిలిచిందో తెలియదు గాని కపిల్ కు మాత్రం ఆహ్వానం అందలేదని ఖరాఖాండిగా చెప్పాడు.
ఇదిలా ఉండగా వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. 45 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. రాహుల్, కోహ్లీ అర్ధ సెంచరీలు చేసి రాణించారు. రోహిత్ శర్మ 47 పరుగులు చేసాడు. ప్రస్తుతం క్రీజ్ లో కుల్దీప్ యాదవ్(0), సూర్య కుమార్ యాదవ్(14) ఉన్నారు.