ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై మున్నూరు కాపు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ మాట్లాడుతూ.. త్వరలో 33 జిల్లాలకు చెందిన మున్నూరుకాపులతో హైదరాబాద్‌లో భారీ సభ ఏర్పాటు చేసి అభినందిస్తామన్నారు.
మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఎడ్ల రవికుమార్పటేల్, బండి సంజీవ్‌పటేల్, రమేశ్‌నాయుడు, చింతపండు మహేందర్పటేల్తదితరులు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రెస్‌క్లబ్‌లో మరో సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విప్ఆది శ్రీనివాస్ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంఘం ఉపాధ్యక్షుడు రమేశ్‌కుమార్, అంగుల మాణిక్‌ప్రభు, కార్యదర్శి కె.సురేశ్ బాబు, కోశాధికారి హన్మంత్‌రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.