సెల్ టవర్లను తొలగించాలి.. శంషాబాద్​లో కాపుగడ్డ వాసుల ఆందోళన

సెల్ టవర్లను తొలగించాలి.. శంషాబాద్​లో కాపుగడ్డ వాసుల ఆందోళన

శంషాబాద్, వెలుగు: తమ ఇండ్ల మధ్య ఉన్న సెల్ టవర్లను తొలగించాలంటూ శంషాబాద్ మున్సిపల్ ఆఫీస్​ను కాపుగడ్డ కాలనీ వాసులు ముట్టడించారు. సోమవారం కార్యాలయం ముందు బైఠాయించి కమిషనర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వంద గజాల ఇంటి స్థలంపై ఇప్పటికే ఒక సెల్ టవర్ ఉండగా, మరొకటి ఏర్పాటు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 దీంతో రేడియేషన్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్ సుమన్ రావుతో వాగ్వాదానికి దిగారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని కమిషనర్ హామీతో కాలనీ వాసులు ఆందోళన విరమించారు.