PSL 2025: ఆ పాక్ క్రికెటర్ కంబ్యాక్ ఇస్తే కోహ్లీ కంటే పెద్ద స్టార్ అవుతాడు: కరాచీ కింగ్స్ ఓనర్

PSL 2025: ఆ పాక్ క్రికెటర్ కంబ్యాక్ ఇస్తే కోహ్లీ కంటే పెద్ద స్టార్ అవుతాడు: కరాచీ కింగ్స్ ఓనర్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో దాదాపు సగం రికార్డులు విరాట్ తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ రికార్డ్స్ ఒకొక్కటిగా బ్రేక్ చేస్తూ ఆల్ టైం బెస్ట్ బ్యాటర్ గా ముందకెళ్తున్నాడు. అయితే సమీప భవిష్యత్తులో కోహ్లీ రికార్డ్స్ బ్రేక్ చేయడం బాబర్ అజామ్ కే సాధ్యమని ఇప్పటికీ చాలామంది క్రికెట్ ఫ్యాన్స్, ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు బాబర్ ఫామ్ లో లేడు. గత రెండేళ్లుగా ఈ పాక్ స్టార్ బ్యాటర్  బాబర్ ఫామ్ ఏమంత గొప్పగా లేదు. ఫార్మాట్ ఏదైనా, టోర్నీ ఏదైనా రాణించలేకపోతున్నాడు. 

ఒకటి రెండు ఇన్నింగ్స్ లు మినహాయిస్తే దాదాపు ప్రతి మ్యాచ్ లో ఘోరంగా విఫలమవుతూ వస్తున్నాడు. ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడుతున్న బాబర్ తొలి మూడు మ్యాచ్ ల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఆడిన మూడు మ్యాచ్ ల్లో మూడు పరుగులు మాత్రమే చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో రెండేళ్లుగా బాబర్ కు సెంచరీ లేదు. దీంతో బాబర్ అజామ్ పై ఫ్యాన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అతను ఇక క్రికెట్ ఆడడం దండగ అని తేల్చేస్తున్నారు. అయితే కరాచీ కింగ్స్ యజమాని సల్మాన్ ఇక్బాల్ మాత్రం బాబర్ ను సపోర్ట్స్ చేయడమే కాదు ఏకంగా ఆకాశానికెత్తేశాడు.

Also Read : 23 కోట్లు తీసుకున్న మోసగాడు

బాబర్ అజామ్ ఒక్కసారి ఫామ్ లోకి వస్తే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కంటే పెద్ద స్టార్ అవుతాడని జోస్యం చెప్పాడు. "బాబర్ ఆజం తన పాత ఫామ్ అందుకుంటే అతను విరాట్ కోహ్లీతో సహా ప్రపంచంలోని అందరి కంటే గొప్ప బ్యాటర్ అవుతాడు. బాబర్  గ్యారీ సోబర్స్, సర్ వివ్ రిచర్డ్స్ వంటి దిగ్గజాల సరసన చేరతాడు". అని కరాచీ కింగ్స్ యజమాని ఇక్బాల్ ARY పాడ్‌కాస్ట్ ద్వారా అన్నారు. బాబర్ అజామ్ ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ లో పెషావర్ జల్మీ తరపున ఆడుతున్నాడు. బాబర్ కెప్టెన్సీలో ఈ సీజన్‌లో ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయి ఒక మ్యాచ్ లో మాత్రమే గెలిచింది.