గోదావరిఖని, వెలుగు: రామగుండం నియోజకవర్గ ప్రజలకు తాను రక్షకుడిగా ఉంటానని, ప్రతి ఒక్కరూ కలసికట్టుగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని పార్టీ అభ్యర్థి ఎంఎస్ రాజ్‌ఠాకూర్ కోరారు. పట్టణంలోని దుర్గానగర్‌లో సోమవారం రామగుండం బూత్ స్థాయి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు, లీడర్లు ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ గ్యారంటీలను వివరిస్తూ ఓటడగాలని సూచించారు. రామగుండం ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిషలు కష్టపడతానన్నారు. కార్యకర్తలు అధికార పార్టీ బెదిరింపులకు భయపడవద్దని, వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం గోదావరిఖనిలో ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. కాగా బీఆర్‌ఎస్‌కు చెందిన కారం వినయ్ పార్టీలో చేరగా ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు.