ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్(Karan johar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధర్మ ప్రొడక్షన్స్(Dharma productions) ద్వారా సినిమాలు నిర్మిస్తూ.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. తెలుగు భారీ బడ్జెట్ సినిమాలను కూడా బాలీవుడ్ లో ప్రొడ్యూస్ చేసి శభాష్ అనిపించుకున్నాడు.
అయితే తాజాగా కరణ్ జోహార్‌కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్ సంస్థలోని 50% వాటాని టీకాల తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్ అధినేత అదర్ పూనావాలా (Adar Poonawalla) దక్కించుకున్నారు. ఈ మేరకు రూ.1000 కోట్ల మేర నిర్మాణ సంస్థలో అదర్ పూనావాలా ఇన్వెస్ట్ చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది.
అయితే, గత కొన్ని రోజులుగా తన నిర్మాణ సంస్థను కరణ్ జోహార్ అమ్మకానికి పెట్టినట్లు తెగ వార్తలు వస్తున్నాయి. ఇపుడు అదే నిజం అయింది. ఈ విషయాన్ని ఇరు కంపెనీలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. మరోవైపు కరణ్‌కు కూడా దీనిలో 50 శాతం వాటా ఉంటుంది, కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కూడా కొనసాగుతారు. అలాగే క్రియేటివ్ పనులన్నీ తానే చూసుకుంటాడు. ఇక ఈ సంస్థ సీఈవోగా అపుర్వా మెహతానే ఉంటారు. నిర్మాణ వ్యవహారాల్లో పునావాలా భాగమవుతారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ధర్మా ప్రొడక్షన్స్ ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ సంస్థ కొనుగోలు చేసే అవకాశం ఉందని కూడా వార్తలు కూడా బలంగా వినిపిస్తూ వచ్చాయి. కానీ, అదర్ పూనావాలా కు ఈ అవకాశం వరించింది.
BIGGG DEVELOPMENT... #AdarPoonawalla’s Serene Productions acquires 50% stake in #KaranJohar’s Dharma Productions *and* Dharmatic Entertainment for ₹ 1,000 cr... OFFICIAL STATEMENT: Read details HERE... pic.twitter.com/ZnXZ9kKKwv
— taran adarsh (@taran_adarsh) October 21, 2024