బాలీవుడ్లో ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా తమ పిల్లలను హీరోలుగానో, హీరోయిన్స్ గానో పరిచయం చేయాలంటే వెంటనే వాళ్లు కలిసేది కరణ్ జోహార్ ని. స్టార్ కిడ్స్ సినిమాల్ని నిర్మించడం మొదలు, ఆ తర్వాత వాళ్లకి కొత్త ప్రాజెక్టులు సెట్ చేయడం, ప్రమోషన్ వగైరాలన్నింటిపై కరణ్ స్పెషల్ కేర్ తీసుకుంటాడనేది బాలీవుడ్లో బహిరంగ రహస్యం. అలా చాలామంది భవిష్యత్తు ప్రస్తుతం కరణ్ చేతిలో ఉంది. కానీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సుసైడ్తో నెపోటిజంపై విమర్శలు వెల్లువెత్తడం, అందులోనూ ముఖ్యంగా కరణ్ పై ట్రోలింగ్, కొన్నిచోట్ల కేసులు కూడా నమోదు అవుతుండడంతో కరణ్ గుప్పిట్లో ఉన్న సెలెబ్రిటీ వారసుల భవిష్యత్తుపై అనుమానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా పుంజుకుంటున్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కెరీర్ గురించి అభిమానుల్లో కంగారు మొదలైంది. గతంలో తన కూతురిని హీరోయిన్గా నిలబెట్టే బాధ్యత కరణ్ జోహార్ కి అప్పగించింది శ్రీదేవి. కరణ్ కూడా శ్రీదేవికిచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఎటొచ్చీ ఇటీవల సుశాంత్ సూసైడ్ ఇష్యూతో ప్రమోషన్ యాక్టివిటీస్ కి కొంత బ్రేక్ ఇచ్చాడు. ఆ ప్రభావం ఆగస్టు 15న ఓటీటీ ద్వారా (నెట్ ఫ్లిక్స్) విడుదల కానున్న జాన్వీ మూవీ ‘గుంజన్ సక్సేనా’పై పడింది. మరో రెండు భారీ ప్రాజెక్టులకి కూడా జాన్వీతో కరణ్ సైన్ చేయించగా అవి కూడా ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు నెపోటిజంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండడంతో ఆ ప్రభావం కూడా జాన్వీ కెరీర్ పై పడే అవకాశాలు లేకపోలేదు. అయితే ఇక్కడ జాన్వీ తండ్రి బోనీకపూర్ ప్రముఖ నిర్మాత అనే విషయం కూడా గుర్తుంచుకోవాలి. హిందీలోనే కాక ఇటు తెలుగులో పవన్ తో, అటు తమిళంలో అజిత్ తో సినిమాలు తీస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ ఆయన. అంతగా జాన్వీకి అవకాశాలు తగ్గితే తన కూతురితోనే వరుస సినిమాలు తీసే సత్తా ఉన్నవాడు. సో జాన్వీకపూర్ కెరీర్ విషయంలో శ్రీదేవి ఫ్యాన్స్అంతగా ఫీలవ్వాల్సిన అవసరం లేదంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.
శ్రీదేవి తనయ జాన్వీ పై కరణ్ జోహార్ ఎఫెక్ట్
- Upcoming Movies List
- June 27, 2020
లేటెస్ట్
- భగవంతుడికి, భక్తుడికి మధ్య..
- సంగారెడ్డి జిల్లాలో 40 ఎకరాల్లో చెరుకు తోటలు దగ్ధం
- మహారాష్ట్రలో కూకట్పల్లి వ్యక్తిని బంధించి డబ్బు డిమాండ్
- విశ్వక్ సేన్ లైలా నుంచి ఇచ్చుకుందాం బేబీ
- సమస్యల సుడిగుండంలో హైదరాబాద్..కష్టాలకు కేరాఫ్‌గా మారింది: కేటీఆర్
- లైబ్రరీలో అన్ని బుక్స్ అందుబాటులో ఉంచాలి : ఐటీడీఏ పీవో బి.రాహుల్
- దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ
- యాదాద్రి గుడిని రాజకీయాలకతీతంగా అభివృద్ది చేయాలి
- సైబరాబాద్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
- ప్రియాంక స్త్రీశక్తి, రాహుల్ యువశక్తి..కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ప్రశంస
Most Read News
- ఇదేందయ్యా ఇది.. రైలును ఆపేసి పట్టాలపై ప్రయాణికుల ఆందోళన
- IND vs ENG: ఇంగ్లాండ్‌తో తొలి టీ20.. భారత్ తుది జట్టు ఇదే
- మదగజరాజా రూ.40 కోట్ల బాక్సాఫీస్: విశాల్ పది రోజుల ముందు.. ఆ తర్వాత మార్పు చూశారా
- WHOకు గుడ్ బై.. వర్క్ ఫ్రం హోం రద్దు.. అమెరికాలో పుడితే పౌరసత్వం ఇవ్వరు : ట్రంప్ సంచలన నిర్ణయాలు
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు
- సారీ.. క్షమించండి: నాగచైతన్య, శోభిత విడాకుల వ్యాఖ్యలపై వేణుస్వామి క్షమాపణ
- Allu Arjun: ఫ్యామిలీతో అల్లు అర్జున్.. ఫోటోలు షేర్ చేసిన భార్య స్నేహారెడ్డి
- IND vs ENG: నలుగురు పేసర్లతో బట్లర్ సేన.. భారత్‌తో తొలి టీ20కి ఇంగ్లాండ్ జట్టు ప్రకటన
- ICC Champions Trophy 2025: టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరును ముద్రించేందుకు వీలు లేదు: బీసీసీఐ
- హైదరాబాద్‌లో రైల్వే పట్టాలపై ఓయూ విద్యార్థిని ఆత్మహత్య