![Viral Video: ట్రాఫిక్ సిగ్నల్ ను .. ఆటో డ్రైవర్ పాటల (కరోకే) వేదికగా మార్చాడు](https://static.v6velugu.com/uploads/2025/02/karaoke-in-mumbai-auto-video-shows-driver-singing-bollywood-songs_ltd0k3cAwr.jpg)
ఏదైనా పని చేయాలంటే చేసెయ్యాల.. స్మార్ట్ ఫోన్ పట్టాల.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల.. లేకపోతే ..ఈ వీడియోఎవరైనా రికార్డ్ చేసి ఇంటర్నెట్ లో షేర్ చేయాల. ఇప్పుడు అలానే ఓ ఆటో డ్రైవర్ తన ఆటోను కరోకే వేదికగా అంటే పాటల వేదికగా మార్చేశాడు.
ముంబైలోని అథేరి సెంటర్ లోని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఓ ఆటో ఆగింది. ఇక అంతే అందరి దృష్టి ఆ ఆటోపై పడింది. ఆటో డ్రైవర్ తన వాహనానికి మైక్రోఫోన్ మరియు స్పీకర్‌ను బిగించి కరోకే ప్రదర్శనను హాస్యనటుడు సమయ్ రైనా షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు.
డ్రైవర్ హారన్ మోగించడానికి బదులుగా పాటలు పాడాడు. 1970 నాటి క్లాసిక్ చిత్రం ..ఘర్.. నుండి ...ఫిర్ వాహి రాత్ హై.. పాటను పాడుతూ సోషల్ మీడియా వినియోగదారులను ఆకర్షించాడు. ఈ ఘటనను
మనోజ్ బాద్కర్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ రికార్డ్ చేశారు. షేర్ చేసిన కొద్ది సేపటికే .. ఈ వీడియో ఏడు లక్షలకు పైగా వ్యూస్‌ను సంపాదించింది.
సోషల్ మీడియా యూజర్లు.. ఆటో డ్రైవర్ ప్రతిభ.. అభిరుచి.. అంకిత భావాన్ని ప్రశంసించారు. ఆటో నడపడం వలన ఆయనకు ఎక్కువ శక్తి వస్తుందని రాశాడు. ఇంకొకరు ఇలా పాటలు పాడటం కంటే మంచి మార్గం ఉండదు.. మీకు కృతజ్ఞతలు అని రాసుకుంటూ వచ్చారు. చాలామంది మాత్రం స్పిరిట్ ఆఫ్ ముంబై... ముంబై మేరీ జాన్.. అని పిలిచారు. ఒక వినియోగదారు అతను నటుడు వినోద్ ఖన్నా లాగా కనిపిస్తున్నాడని కూడా అన్నారు. అమితాబ్ బచ్చన్‌ను తన వాహనం ఎక్కిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ అయింది.