కరాటే చాంపియన్ షిప్ షురూ

గచ్చిబౌలి, వెలుగు: జపాన్ కరాటే అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో కరాటే చాంపియన్ షిప్ – -2025 పోటీలు షురూ అయ్యాయి. ఈ నెల 22 వరకు ఐదు రోజులపాటు జరగనున్న పోటీలను జేకేఏ హెడ్ క్వార్టర్స్ ఇన్ స్ట్రక్టర్ 8వ డాన్ ఇమురా షిహాన్ శనివారం ప్రారంభించారు. మొదటి మూడు రోజులు జాతీయ స్థాయి క్రీడాకారులకు, ఆ తర్వాతి రెండు రోజులు అంతర్జాతీయ క్రీడాకారులకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 8 ఏండ్ల నుంచి 72 ఏండ్ల వయస్సు ఉన్న 1200 మంది క్రీడాకారులు టోర్నీలో పాల్గొంటున్నారని, వీరిలో న్యూజిలాండ్, అమెరికా, శ్రీలంక, రష్యాతోపాటు కజకిస్తాన్ కు చెందిన  125 మంది విదేశీయులు, 400 మంది తెలంగాణ క్రీడాకారులు, మిలిగిన వారు 25 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఉన్నారన్నారు.