కరాటే ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

కరాటే ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్, వెలుగు : కరాటే ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని , ఆత్మవిశ్వాసానికి కరాటే ఎంతో అవసరమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. వెస్ట్  మారేడుపల్లిలోని ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నుంచి  పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు  సెవంత్ డాన్ బ్లాక్‌బెల్ట్‌ సర్టిఫికెట్‌ను గ్రాండ్ మాస్టర్ శ్రీనివాసన్ ప్రదానం చేశారు.  

ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ తన జీవితంలో ఓ భాగమని చెప్పారు. యువత చెడు వ్యసనాల బారిన పడకుండా కరాటే వంటి ఆటలను అలవరచుకోవాలని పిలుపునిచ్చారు. అమ్మాయిలు కరాటే నేర్చుకోవాలని కోరారు.