
అల్వాల్, వెలుగు: ప్లే స్కూల్లో చదువుతున్న నాలుగేండ్ల చిన్నారిని కరాటే టీచర్ కొట్టిన ఘటన అల్వాల్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుభాష్‌నగర్‌లోని మానసరోవర్ వద్ద ఉన్న ప్లే స్కూల్లో రుతిక(4) అనే చిన్నారి చదువుతోంది. అదే స్కూల్లో కరాటే మాస్టర్ గా పనిచేస్తున్న కల్యాణ్.. శుక్రవారం రుతికకు నేర్పిస్తున్న క్రమంలో కోపంతో కొట్టాడు. దీంతో చిన్నారి కాళ్లకు గాయాలయ్యాయి. ఇంటికి చేరుకున్న తమ కూతురిని చూసిన తల్లిదండ్రులు విషయాన్ని అడిగి తెలుసుకొని వెంటనే అల్వాల్ పీఎస్‌లో కంప్లయింట్ చేశారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.