జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం అటవీ ప్రాంతంలో కార్చిచ్చు స్థానికులను టెన్షన్ పెడుతోంది. పెద్దఎత్తున మంటలు వ్యాపిస్తుండటంతో సమీపంలోని పల్లెల వాసులు భయంతో వణికిపోతున్నారు. నీలగిరి చెట్ల సమీపంలో చెలరేగిన మంటలు ఫారెస్ట్ ఏరియాలోకి వేగంగా వ్యాపించాయి.
అటు ఫారెస్ట్ సిబ్బంది ఏమాత్రం పట్టించుకోకపోవటంతో విలువైన అటవీ సంపద నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు.