సినీ సెలబ్రెటీల జీవితాలపై అందరూ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దీంతో ఎక్కువగా గాసిప్స్, రూమర్స్ క్రియేట్ చేస్తూ సెలెబ్రెటీలని ఇబ్బందులకు గురిచేసిన ఘటనలు కూడా కోకొల్లలు. అయితే ఇటీవలే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఆయనపై దొంగ కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే.
దీంతో బాలీవుడ్ మీడియా మొత్తం సైఫ్ కి సంబంధించిన వార్తలు, కథనాలు, వీడియోలు పబ్లిష్ చేస్తున్నారు. ఈ క్రమంలో సైఫ్ అలీఖాన్ ఇంటి చుట్టూ కెమెరాలతో గస్తీ కాస్తున్నారు. కొందరైతే సైఫ్ గురించి ఉన్నవీలేనివి కల్పించి ప్రచారాలు చేస్తున్నారు. ఇంకొందరు సైఫ్ కుటుంబం బాధలో ఉంటే తైమూర్, జెహ్ కోసం కొత్త బొమ్మలు తెచ్చారని, అలాగే సైఫ్ అలీఖాన్ పిల్లల్తో ఆడుకుంటున్న ఫోటోలని షేర్ చేశారు.
Also Read : కన్నప్ప నుంచి శివుడి పాత్ర రివీల్
ఈ విషయంపై కరీనా కపూర్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఇందులోభాగంగా ఈ తప్పుడు ప్రచారాల ఫొటోస్ ని షేర్ చేస్తూ ఇకనుంచయినా " దయచేసి మమ్మల్ని ఒంటరిగా వదిలేయండంటూ" ఎమోషనల్ స్టోరీ ని ఇన్స్టాగ్రామ్ షేర్ చేసింది. ఆ తర్వాత ఏమైందోఏమోగానీ మళ్ళీ వెంటనే డిలీట్ చేసింది. దీంతో కొందరు అభిమానులు కరీనా కపూర్ కి మద్దతుగా నిలుస్తున్నారు. అలాగే సినీ సెలెబ్రెటీలకి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుందని అలాగే బాధలో ఉన్నప్పుడు వ్యూస్ కోసం ఇలాంటి ప్రచారాలు చెయ్యడం కరెక్ట్ కాదని అంటున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా జనవరి 16న తెల్లవారుజామున 2:00 గంటల సమయంలో మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే వ్యక్తి సైఫ్ ఇంట్లోకి చొరబడి దారుణంగా కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో సైఫ్ అలీ ఖాన్ కి దాదాపుగా 6 కత్తిపోట్లు పడగా ప్రస్తుతం ముంబైలోని లీలావతి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. నిందితుడిపై 311, 312, 331(4), 331(6), మరియు 331(7) తదితర సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు పోలీసులు.