సైఫ్ పై దాడికి కొద్దిసేపు ముందే పార్టీ నుంచి వచ్చిన భార్య కరీనా..

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై బాంద్రా నివాసంలో జరిగిన కత్తితో దాడి ఒక్కసారిగా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం సృష్టించింది. గురువారం తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో తన ఇంట్లో దొంగ చొరబడి చోరీకి ప్రయత్నిస్తుండగా సైఫ్ అలీఖాన్ అడ్డుకునేందుకు యత్నిచాడు. దీంతో దొంగ తప్పించుకునేందుకు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దారుణంగా దాడి చేశాడు. ఇది గమనించిన సైఫ్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ వెంటనే సైఫ్ అలీ ఖాన్ ని దగ్గర్లోని లీలావతి ఆసుపత్రిలో చేర్పించాడు. 

అయితే సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన సమయంలో ఆయన భార్య నటి కరీనా కపూర్ ముంబైలో జరిగిన ఓ ధనవంతుల పార్టీకి హాజరైనట్లు తెలుస్తోంది. ఈ పార్టీ అనంతరం అర్థరాత్రి 1:30 గంట సమయంలో మళ్ళీ ఇంటికి చేరుకున్నట్లు సమాచారం. అయితే సైఫ్ పై దాడి జరిగిన సమయంలో కరీనా కపూర్ ఇంట్లోనే ఉన్నప్పటికీ ఇబ్రహీం అలీ ఖాన్ ఒక్కడే తన తండ్రిని ఆటతో ఆసుపత్రికి తరలించాడు.  

ALSO READ | OMG : అర్థరాత్రి ఒళ్లంతా రక్తం.. ఆటోలో ఆస్పత్రికి సైఫ్ అలీఖాన్

ఈ ఘటనలో సైఫ్‌కు ఆరు కత్తిపోట్లు పడ్డాయి, వాటిలో రెండు వెన్నెముకకు దగ్గరగా ఉన్నాయి.  సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిశిలించి స్థానికులు తెలిపి వివరాలు ఆధారంగా  విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.