
కామేపల్లి వెలుగు : కుటుంబానికి ఇన్సూరెన్స్ ఆర్థిక భద్రత ఇస్తుందని, సంపాదించే వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి అండగా ఉంటుందని కారేపల్లి సీఐ తిరుపతి రెడ్డి తెలిపారు. బుధవారం కొమ్మినేపల్లి గ్రామానికి చెందిన మామిళ్ల లక్ష్మీబాయి ఐదేండ్ల కింద శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు.
కొద్ది నెలల కింద ఆమె అనారోగ్యంతో చనిపోవడంతో ఆమె భర్త చిన్న నర్సయ్యకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం సీఐ రూ.3.36 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రతీ కుటుంబం ఆర్థిక భద్రత కోసం ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు.