అంబులెన్స్లో వచ్చి కలెక్టర్కు ఫిర్యాదు

ఓ వ్యక్తి బిల్డింగ్ కు పెయింటింగ్ వేస్తుండగా ప్రమాదవశాస్తు కిందపడ్డాడు. దీంతో అతని వెన్నుపూస విరిగి గత ఏడు నెలలుగా బాధపడుతున్నాడు. ఇంటికి పెద్ద దిక్కైన ఆ వ్యక్తి మంచాన పడటంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలంటూ ఆ వ్యక్తి ఏకంగా అంబులెన్స్ లోనే వచ్చి జిల్లా కలెక్టర్ కు మొరపెట్టుకున్నాడు.

కరీంనగర్ లోని ఆదర్శ్ నగర్ కు చెందిన పవన్ ఏడు నెలల క్రితం ఆనంద్ నగర్ లోని ఒ బిల్డింగ్ కి పెయింటింగ్ వేస్తూ ప్రమాదానికి గురైయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నా.. తన ఆరోగ్యం సరికాలేదు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ భార్య పిల్లలతో సహా అంబులెన్స్ లో వచ్చి కలెక్టర్ ఫిర్యాదు చేశాడు. ఫిజియోథెరపీతో పాటు మందులకు నెలకు రూ.15 నుంచి 20 వేల వరకు ఖర్చు అవుతుందని బాధితుడు కలెక్టర్ కు వివరించాడు.  వెంటనే కలెక్టర్ సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు.