రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో కరీంనగర్, ఆదిలాబాద్ విజేతలు

రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో కరీంనగర్, ఆదిలాబాద్ విజేతలు

హుజూరాబాద్‌, వెలుగు: 68వ ఎస్‎జీఎఫ్ రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో కరీంనగర్ బాలికల జట్టు, ఆదిలాబాద్ బాలుర జట్టు విజేతలుగా నిలిచాయి. గత నెల 29 నుంచి ఆదివారం వరకు హుజురాబాద్ టౌన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్‎లో అండర్–14 ఏండ్లలోపు బాల బాలికలకు నిర్వహించిన పోటీలు ఘనంగా ముగిశాయి. ఇందులో రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి 20 హాకీ జట్లు పాల్గొన్నాయి. స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హాజరై విజేత జట్లకు బహుమతులను అందజేశారు. కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్,  ఎస్‌సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్‌ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ గందె రాధిక , కౌన్సిలర్లు, హాకీ కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.