ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారంటే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది. నవంబర్ 30వ తేదీ గురువారం తెలంగాణలో 119 నియోజకవర్గాల అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన విధంగానే డిసెంబర్ 3వ తేదీ ఆదివారం జరుగుతున్న ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. 

ఉమ్మడి రంగారెడ్డి లో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారో చూద్దాం:

  • కరీంనగర్: బీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ విజయం
  • ధర్మపురి: కాంగ్రెస్ అభ్యర్థి  అడ్లూరి లక్ష్మణ్ విజయం
  • రామగుండం: కాంగ్రెస్ అభ్యర్థి ఎం ఎన్ రాజ్ ఠాకూర్ విజయం
  • మంథని:కాంగ్రెస్ అభ్యర్థి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు విజయం
  • పెద్దపల్లి:కాంగ్రెస్ అభ్యర్థి సిహెచ్ విజయరామారావు విజయం
  • జగిత్యాల: బీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ ఎం సంజయ్ కుమార్ విజయం
  • చొప్పదండి:కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం విజయం
  • వేములవాడ: కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ విజయం
  • సిరిసిల్ల: బీఆర్‌ఎస్ అభ్యర్థి కేటీఆర్ విజయం
  • మానకొండూర్: కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ విజయం
  • హుజూరాబాద్: బీఆర్‌ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి విజయం
  • కోరుట్ల: బీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ విజయం