నిత్యం కేసులు, దర్యాప్తుల మధ్య బిజీబిజీగా గడిపే కరీంనగర్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ ..తనలో దాగి ఉన్న టాలెంట్ ను వెలికితీశారు. తాను ఎంతో ఇష్టంగా భావించే సంగీతంపై ఉన్న మక్కువను చాటుకున్నారు. డీసీపీ శ్రీనివాస్ తన మధురగానంతో అద్భుతంగా పాట పాడి అందరినీ ఆకట్టుకున్నారు. సంగీత సాంస్కృతిక కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఓ సినిమాలోని పాటను అద్భుతంగా ఆలపించారు. లయబద్దంగా ఆడ, మగ గొంతులతో పాట పాడి ఆహూతులను ఆశ్చర్యానికి గురి చేశారు.
డీసీపీ శ్రీనివాస్ స్టేజీపై పాడుతున్నంత సేపు ప్రేక్షకులు ఆసక్తిగా తిలకించారు. ఆడ..మగ రెండు గొంతులతో పాట పాడటంతో కార్యక్రమానికి వచ్చిన వారు చప్పట్లు, కేరింతలు కొట్టారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు గొంతులతో పాట పాడిన అడిషనల్ డీసీపీకి నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.