కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దక్కేదెంత..!

కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దక్కేదెంత..!
  • నవోదయ స్కూళ్లు, ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటయ్యేనా  ?
  • ప్రసాద్ స్కీమ్, రామాయణ సర్క్యూట్ లో ఉమ్మడి జిల్లా ఆలయాల చేర్పుపై ఉత్కంఠ  
  • ఆన్ గోయింగ్, కొత్త రైల్వే ప్రాజెక్టులకు నిధులు దక్కేనా..
  • నేటి కేంద్రబడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఉమ్మడి జిల్లావాసుల ఆశలు 

కరీంనగర్, వెలుగు: కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ప్రత్యేక కేటాయింపుల కోసం ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించిన హామీలు  నెరవేరుతాయని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టబోయే 2‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌025–26 బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్తపల్లి–మనోహరాబాద్ లాంటి  ఆన్ గోయింగ్ రైల్వే ప్రాజెక్టులు, హసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్తి–కరీంనగర్, రామగుండం-–మణుగూరు కొత్త రైల్వేలైన్లు, పెద్దపల్లి బైపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైల్వేస్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-, లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తి, పెద్దపల్లి-–నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబ్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులకు నిధుల కేటాయింపు, కొత్త రైళ్ల ప్రస్తావన ఉంటుందేమోనని భావిస్తున్నారు.

కేంద్ర సహాయ మంత్రి హామీలు నెరవేరేనా?

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జిల్లాకో నవోదయ విద్యాలయం చొప్పున ఉంది. తెలంగాణలో కొత్తగా33 జిల్లాలు ఏర్పడినప్పటికీ ఉమ్మడి 9 జిల్లాల్లోనే 9 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. కొత్త జిల్లా కేంద్రాల్లోనూ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉండడంతో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో మాట్లాడి తన నియోజకవర్గ పరిధిలోని సిరిసిల్ల, వంగర(హన్మకొండ)లో  నవోదయ స్కూళ్ల ఏర్పాటుకు ఒప్పించినట్లు ఇటీవల ప్రకటించారు.

 అలాగే ప్రసాద్ స్కీంలోకి వేములవాడ రాజన్న ఆలయాన్ని, రామాయణ సర్క్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి కొండగట్టు అంజన్న ఆలయం, ఇల్లందకుంట సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని చేర్చబోతున్నట్లు ప్రకటించారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. బడ్జెట్ లో ఇందుకనుగుణంగా కేటాయింపులు ఉంటాయని ఉమ్మడి జిల్లా ప్రజలు ఎదురు చేస్తున్నారు.  కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయాలనే చాన్నాళ్లుగా వినిపిస్తోంది. 

ఆన్ గోయింగ్, కొత్త రైల్వే ప్రాజెక్టులకు నిధులపై ఆశలు.. 

నిరుడు ఉమ్మడి జిల్లాలోని రైల్వే ప్రాజెక్టులకు కేటాయించిన నిధులతో పనుల్లో కొంత ముందడుగు పడింది.  గతేడాది వివిధ రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.647 కోట్లు కేటాయించిన కేంద్రం... ఈ సారి ఎంత కేటాయిస్తుందనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. కొత్తపల్లి–మనోహరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని 2016లో రూ.1,167 కోట్ల అంచనాతో పనులు  ప్రారంభించింది. 

ఇప్పటివరకూ మనోహరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి సిద్ధిపేట వరకు లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తి కావడంతో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. కొత్తపల్లి–మనోహరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైల్వేలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇందుకోసం గతేడాది కేంద్రం రూ.350 కోట్లు కేటాయించింది. మొత్తం 151 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం ఇప్పటి వరకూ 75 కిలోమీటర్లే పూర్తయింది. ప్రస్తుతం సిరిసిల్ల–సిద్ధిపేట (37 కి.మీ) లైన్ లో భూసేకరణ పూర్తయింది. ట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులు నడుస్తున్నాయి. సిరిసిల్ల నుంచి కొత్తపల్లి మధ్య భూసేకరణ పూర్తి చేయాల్సి ఉంది. 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-–హసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్తి కొత్త రైల్వేలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గతేడాది రూ.5 కోట్లతో ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లొకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వే(ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) చేయించారు. ఈసారి బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేటాయించే నిధులను బట్టి భూసేకరణతోపాటు ప్రాజెక్టు భవితవ్యం ముడిపడి ఉంది. 

కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కారిడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పిలుస్తున్న రామగుండం–మణుగూరు రైల్వేలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లిని కనెక్ట్ చేస్తూ  వెళ్తుంది. ఈ లైన్ పూర్తయితే రామగుండం–మణుగూరు పట్టణాల మధ్య దూరం 290 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్లకు తగ్గనుంది. రూ.3 వేల కోట్ల అంచనాతో 2022 డిసెంబరులో ఈ మార్గానికి ప్రధాని మోదీ రామగుండంలో శంకుస్థాపన చేశారు. కానీ పెద్దగా నిధులు కేటాయించలేదు. 

పెద్దపల్లి-–నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూట్ లో గూడ్సు రైళ్లు తిరుగుతున్నాయి. ఈ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డబ్లింగ్ చేయాలనే డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలా ఏళ్లుగా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది.