పగిలిన భగీరథ మెయిన్ పైప్ లైన్

జిల్లావ్యాప్తంగా సప్లై బంద్

​మెట్ పల్లి, వెలుగు: రెండు రోజులు కింద ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామం వద్ద భగీరథ మెయిన్ ​పైప్​లైన్​పగిలిపోయి జిల్లాలో వాటర్​సప్లై నిలిచిపోయింది. దీంతో జిల్లావ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీలు, 384 పంచాయతీల్లో తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం మెట్‌పల్లి టౌన్‌లో కొన్ని చోట్ల ట్యాంకర్ల ద్వారా నీరు సప్లై చేశారు. ఈ విషయమై వాటర్ గ్రిడ్ డీఈ  ప్రేమ్ కుమార్ ను వివరణ కోరగా డబ్బా వాటర్ గ్రిడ్ నుంచి జిల్లా వ్యాప్తంగా భగీరథ నీరు సరఫరా చేసే మెయిన్ పైప్ లైన్ డ్యామేజ్ అయ్యి లీకేజీ అయిందన్నారు. రిపేర్లు చేస్తున్నామని తొందరలోనే నీటి సప్లై పునరుద్ధరిస్తమాని డీఈ తెలిపారు.