షర్మిలకు బీఆర్ఎస్ కౌంటర్

సీఎం కేసీఆర్కు షూను బహుకరిస్తానన్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు కరీంనగర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతల దాడి చేసే అవకాశమున్నందున మెడికల్ కిట్ను దగ్గర పెట్టుకోవాలని సూచించారు. షర్మిలకు మెడికల్ కిట్ ను  బహుమతిగా పంపిన ఆయన.. పాదయాత్రకు బయలుదేరే ముందు దాన్ని వెంట తీసుకెళ్లాలని కోరారు. తెలంగాణకు వైఎస్ పచ్చి వ్యతిరేకన్న రామకృష్ణ.. ఆయన బిడ్డైన షర్మిలకు తెలంగాణలో మాట్లాడే అర్హత లేదన్నారు.  తెలంగాణ గడ్డతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదన్నారు. షర్మిలకు చిత్తశుద్ధి ఉంటే ఏపీలో పాదయాత్ర చేసుకోవాలన్నారు.